(3 May) ఖైరతాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసి...
(3 May) ఖైరతాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం పంజాగుట్ట కూడలిలో నిరసన చేపట్టారు. మాజీ కార్పొరేటర్, నగర యాదవ సంఘం అధ్యక్షుడు మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవ కులస్తులు చంద్రబాబు నాయుడికి వ్యితిరేకంగా నినాదాలు చేస్తూ పంజాగుట్ట రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు టిడిపి లేకపోతే కేసిఆర్ గొర్రెలు కాసుకునే వాడంటూ వ్యాఖ్యానించి యాదవ కులాన్ని కించపరిచారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తెలంగాణాని అన్ని రంగాల్లో మోసం చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు తెలంగాణ ఏర్పాటు జరిగిన అనంతరం కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారపూరితంగా మాట్లాడుతూ యాదవులను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమని, ఇది కేవలం తెలంగాణ యాదవులకు సంబంధించిన విషయమే కాదని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాదవులంతా చంద్రబాబు నాయుడిని నిలదీయాలని ఆయన కోరారు. ఏపి సిఎం చంద్రబాబు వెంటనే యాదవులకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, రమేష్‌యాదవ్, టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఉపాధ్యక్షుడు మధుకర్ యాదవ్, నాని, వెంకటేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై యాదవ కులస్థులు చేపట్టిన నిరసనతో అమీర్‌పేట వైపు నుంచి ఖైరతాబాద్ వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పంజాగుట్ట పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
