వర్ని: చోరీ చేసిన బాలుడు అక్కడే నిద్రించి పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్లోజమాల్ ఇంట్లో గ్రామానికే చెందిన బాలుడు...
వర్ని: చోరీ చేసిన బాలుడు అక్కడే నిద్రించి పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్లోజమాల్ ఇంట్లో గ్రామానికే చెందిన బాలుడు (14) ఆదివారం తెల్లవారుజామున చోరికి వచ్చాడు. ఇంటి వెనుక తలుపులను ధ్వంసం చేశాడు. తర్వాత ఇంట్లోని రూ.10వేలు, ఐదుతులాల బంగారాన్ని దొంగింలించాడు. చోరీ చేసే క్రమంలో అలసిపోయి అక్కడే గాఢనిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్సై అంజయ్య వచ్చి బాలుడిని లేపి సొత్తు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. గతంలో పాఠశాలలో మధ్యాహ్నభోజనం బియ్యాన్ని చోరీచేసి బాలుడు జైలుకు వెళ్లాడు. ఇటీవల పోస్టాఫీస్‌లో ఉద్యోగిని నగదు, సెల్ఫోన్లు కెమెరాను దొంగిలించి జైలుకెళ్లి మూడురోజుల కిందటే వచ్చి మళ్లీ పట్టుబడ్డాడు.
Key Tags
steal