(3 May) మంచిర్యాల, మే 2: భానుడి ప్రతాపం భగభగ మండుతుంది. మే మాసం మొదలు కాగానే ఉష్ణోగ్రత్త ఒక్కసారిగా 44డిగ్రీలకు చేరుకోవడంతో ఉదయం 7గంటల న...
(3 May) మంచిర్యాల, మే 2: భానుడి ప్రతాపం భగభగ మండుతుంది. మే మాసం మొదలు కాగానే ఉష్ణోగ్రత్త ఒక్కసారిగా 44డిగ్రీలకు చేరుకోవడంతో ఉదయం 7గంటల నుంచి ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో రోడ్డుపై ఒక్కరు కూడా కనిపించకపోవడంతో రోడ్లన్ని నిర్మానుశ్యంగా మారుతున్నాయి. రెండు రోజులుగా విద్యుత్ కోత మొదలు కావడంతో ఇంట్లో కూలర్లు, ఫ్యాన్లు, ఏసిలు లేకపోవడంతో ఉక్కపోతను తట్టుకోలేక పిల్లల నుంచి మొదలుకుని వృద్దుల వరకు నానా అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల పరిసర ప్రాంతంలో బొగ్గు బావులు ఉండటంతో వేడి నిప్పులా కొరివిలా కాలిపోతుంది. సింగరేణి కార్మికులు ఓసిలో విధులు నిర్వహించాలంటే జంకుతున్నారు. భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు గాలి లేక ఇబ్బందులు పడుతుంటే భూమిపైకి వచ్చేసరికి ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగిపోవడంతో వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరై ముసలివారు వడదెబ్బతో మృతి చెందుతున్నారు. ఇప్పటికే తూర్పు ప్రాంతంలో ఏప్రిల్ 20నుంచి మే 2వరకు సుమారు పదిమంది వడదెబ్బతో మృతి చెందాడు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు సైతం ఎండవేడిమి తట్టుకోలేక చెట్ల కిందకు వెళ్లి సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. పట్టణంలోని వార్డుల్లో చిరువ్యాపారస్థులు తిరుగలేని పరిస్థితి నెలకొంది.
