దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర దేవస్థానానికి పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆలయాల భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ ...
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర దేవస్థానానికి పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆలయాల భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ అవధాని మోహనశర్మ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దేవాదాయశాఖ సెక్రటరీ శివశంకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానానికి ప్రతిఏటా రూ. 4 కోట్ల ఆదాయం లభిస్తున్నదని, స్వామివారి ఆలయం పేరిట భూములు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం విడుదల చేసిన జీవోలో ఈ దేవస్థానం పేరు పేర్కొనలేదని, ఈ నేపథ్యంలో శ్రీకాళేశ్వరస్వామి దేవాలయానికి కూడా ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేసే విధంగా జీవోను ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
