(24 Jun) ఇంటర్ బోర్డు ప్రక్షాళన: కడియం ఆలస్యం, అవినీతి ఆరోపణల నుంచి ఇంటర్ బోర్డును బయట పడేసేందుకు ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నట...
(24 Jun) ఇంటర్ బోర్డు ప్రక్షాళన: కడియం
ఆలస్యం, అవినీతి ఆరోపణల నుంచి ఇంటర్ బోర్డును బయట పడేసేందుకు ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జులై 1 నుంచి ఆన్లైన్లో 22 సేవలు అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామన్నారు. 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్షా 17వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయం. దాదాపు రూ.9 కోట్లను ఇంటర్ బోర్డు భరిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తం. ఖాళీ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.