హాలీవుడ్ నటి క్రిస్‌ప్రాట్, అమందసిల్వర్, విన్సెంట్ డియోనోప్రియో, అమందసిల్వర్, బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించ...
హాలీవుడ్ నటి క్రిస్‌ప్రాట్, అమందసిల్వర్, విన్సెంట్ డియోనోప్రియో, అమందసిల్వర్, బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరింది. కొలిన్ ట్రివోరో దర్శకత్వంలో జురాసిక్పార్క్కు సీక్వెల్‌గా వచ్చిన జురాసిక్ వరల్డ్ భారత్‌లో విడులైన మూడు వారాల్లోనే రూ.100కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా హిందీ,తమిళ,తెలుగు భాషల్లో దేశవ్యాప్తంగా 2,108 థియేటర్లలో విడుదలైంది.
2015లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకుకొచ్చిన జురాసిక్ వరల్డ్ ఆసక్తికరంగా డైనోసార్ల ఇతివృత్తంతో అందరినీ అలరిస్తూ దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. గతంలో విడుదలైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ కలెక్షన్ల సునామీలో ఫస్ట్ ప్లేస్‌లో..‘జురాసిక్ వరల్డ్’ రెండవ స్థానంలో ఉండి వాలీవుడ్ చిత్రాలు భారతీయ మార్కెట్లో భారీ వసూళ్లను రాబడుతున్నాయని యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.