కరీంనగర్: రామగుండం ఆర్జీ టు డివిజన్లో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు జులై 11 నుండి సమ్మెకు దిగనున్నట్లు ఐఎఫ్టియు అనుబంధ సింగరేణి ...
కరీంనగర్: రామగుండం ఆర్జీ టు డివిజన్లో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు జులై 11 నుండి సమ్మెకు దిగనున్నట్లు ఐఎఫ్టియు అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కేంద్ర అధ్యక్షులు తెలిపారు. ఈమేరకు గురువారం ఆర్జీ టు జీఎం సమ్మె నోటీసు అందజేశారు. యాజమాన్యం విడుదల చేసిన జీవో నెం.568 ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 2007 సెప్టెంబర్ నుండి కార్మికుల నుండి రికవరి చేసిన సిఎంపిఎఫ్ డబ్బుల వివరాలతో కూడిన చిట్టీలు అందజేయాలని, ప్రతీ నెల కార్మికులకు జీతం చిట్టీలు అందజేయాలని, ప్రతికార్మికుడికి యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తోటమాలి కార్మికులకు వైద్య పుస్తకాలు ఇవ్వాలని, కార్మికుల సిఎంపీఎఫ్ వివరాలు ఆన్లైన్లో పెట్టాలని, సిఎంపీఎఫ్ వ్యవహారాలు చేసేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని తదితర డిమాండ్లను సమ్మె నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.వెంకన్నతో పాటు బి.అశోక్, ఎస్.సురేష్, రాజనర్సు, దుర్గయ్య, బుచ్చమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.