(30 Jun) పుష్కరాలకు రైల్వే ఏర్పాట్లు 13 నుంచి 26 వరకు కొనసాగింపు హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం బాసరకు వెళ్లే భక్తుల సౌకర్యార...
- (30 Jun)
- పుష్కరాలకు రైల్వే ఏర్పాట్లు
- 13 నుంచి 26 వరకు కొనసాగింపు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం బాసరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 130 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 13 నుంచి 26 వరకు ప్రతి రోజూ నిజామాబాద్- బాసర (07801/07802) మధ్య 28 ప్రత్యేక రైలు సర్వీసులు ఉంటాయని చెప్పారు. ఉదయం 10.35 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరే పుష్కరాల ప్రత్యేక రైలు అదేరోజు ఉదయం 11.30 గంటలకు బాసర చేరుకుంటుంది. తిరిగి అదేరోజు మధ్యాహ్నం 1.15 గంటలకు బాసర నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ వస్తుంది. నిజామాబాద్- బాసర (07803/07804) మరో స్పెషల్ ట్రైన్ మధ్యాహ్నం 2.15 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 3 గంటలకు బాసర చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.20 కి బాసర నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 కి నిజామాబాద్ చేరుకుంటుంది. నిజామాబాద్- బాసర (07805/07806) ఇంకొక ట్రైన్ కూడా 28 సర్వీసులు నడుస్తుంది. ఇది రాత్రి 11 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 12.15 కు బాసర చేరుకుంటుంది. తిరిగి తెల్లవారు జామున 4 గంటలకు బాసర నుంచి బయలుదేరి ఉదయం 4.50 కి నిజామాబాద్ చేరుకుంటుంది.అలాగే, గుంతకల్-ధర్మాబాద్ మధ్య 14 సర్వీసులు నడుస్తాయి. ఈ ట్రైన్ జూలై 14, 16, 18, 20, 22, 24, 26 తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంటకు గుంతకల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.32 గంటలకు బాసరకు, 5 గంటలకు ధర్మాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 15, 17, 19, 21, 23, 25, 27 తేదీలలో ఉదయం 6.20 కు బాసర నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 9.45 కు గుంతకల్ చేరుకుంటుంది. ఈ రైళ్లకు సెకెండ్ క్లాస్ జనరల్ బోగీలే ఉంటాయి. కాచిగూడ-ధర్మాబాద్ (07807/07808) మధ్య 14 సర్వీసులు నడుస్తాయి. ఈ రైళ్లు జూలై 13, 15, 17, 19, 21, 23, 25 తేదీలలో ఉదయం 7 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 11 గంటలకు బాసర చేరుకుంటాయి. 11.20 గంటలకు తిరిగి బాసర నుంచి బయలుదేరి 11.30 కు ధర్మాబాద్ చేరుకుంటాయి. తిరిగి మధ్యాహ్నం 12.15 కు బాసర నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటాయి. కాచిగూడ- ధర్మాబాద్ (07808/07809) మరో ట్రైన్ 14 సర్వీసులు నడుస్తుంది. ఇది జూలై 14,16,18,20,22,24,26 తేదీలలో ఉదయం 7 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు బాసర చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 11.30 కు ధర్మాబాద్ చేరుకుంటుంది. తిరిగి 12.15 కు బాసర నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. నాందేడ్- నిజామాబాద్ (07816/07817) ట్రైన్ జూలై 16, 23 తేదీలలో ఉదయం 10.30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి ఉదయం 11.58 కి బాసరకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.45 కు నిజామాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.43 కు బాసర నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 కు నాందేడ్‌కు వస్తుంది.