న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్, అమృత్ పథకాల ద్వారా అభివృద్ది చేయాల్సిన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్, అమృత్ పథకాల ద్వారా అభివృద్ది చేయాల్సిన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వంద స్మార్ట్ నగరాలు, ఐదు వందల అమృత్ నగరాలు ఉన్నాయి. ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ నగరాల అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. మన రాష్ర్టానికి 2 స్మార్ట్ నగరాలను, 15 అమృత్ నగరాలను కేటాయించారు. పొరుగు రాష్ట్రం ఏపీకి 3 స్మార్ట్ నగరాలు, 31 అమృత్ నగరాలను కేటాయించారు. కాగా, యూపీ రాష్ట్రం నుంచి అత్యధికంగా 15 స్మార్ట్ నగరాలు, 54 అమృత్ నగరాల కింద ఎంపికయ్యాయి.
