కొండెక్కిన కోడి మాంసం లబోదిబోమన్న నగర ప్రజలు పౌల్ట్రీ రంగంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్, అయితే బర్డ్‌ప్లూతో పాటు ఈ ఏడాది ఎండా కాలం...
కొండెక్కిన కోడి మాంసం లబోదిబోమన్న నగర ప్రజలు
పౌల్ట్రీ రంగంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్, అయితే బర్డ్‌ప్లూతో పాటు ఈ ఏడాది ఎండా కాలంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో లక్షలాది కోళ్లు చనిపోయాయి. అయితే బర్డ్ ప్లూ నుంచి ఇటీవలే తేరుకున్న పౌల్ట్రీ రంగం, ఎండ కాలం కాస్తా ముగింపు దశలో ఉండడంతో కోడి మాంసానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
హైదరాబాద్ : కోడి మాసం ధరలు కొండెక్కి కూర్చోవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలే అదివారం సెలవు దినం…పేదోడు ..గొప్పడు అనే తేడా లేకుండా మాంస ఆహార ప్రియులు అటూ వైపు మొగ్గు చూపడం సహజం. అయితే కాస్తా చికెన్ తెచ్చుకుని పసందైన రుచులతో రకరకాల డిష్‌లు చేసుకుందామని బజారు కెళ్లిన చికెన్ప్రియులకు ఒక్కసారిగా బిత్తరపోయారు. చికెన్ ధర ఏకంగా అకాశానంటడంతో వారు కాస్తా డీలా పడ్డారు. కిలో చికెన్ కొద్దామని షాప్‌లకు వెళ్లిన వారు అద్ద కిలోతో సరి పెట్టుకునే పరిస్థితి ఎదురైంది. శనివారం వరకు రూ.160 లోపు ఉన్న స్కీన్ లెస్ చికెన్ ధర ఆదివారం కాస్తా ఏకంగా రూ.222 లకు చేరింది. స్కీన్‌తో రూ.130 లోపు ఉన్న ధర రూ. 188లు, రూ. 95 నుంచి రూ.98లు ఉన్న లైవ్ ధర రూ.130లకు పెరగడంతో చికెన్ ప్రియులకు అది శరాఘాతంగా మారింది. బర్డ్‌ఫ్లూకు తోడు ఎండల తీవ్రతకు పౌల్ట్రీ రంగం కుదేలు అయిన విషయం తెలిసిందే. అది కాస్తా ఇప్పుడు చికెన్ ప్రియులకు శాపంగా మారింది. పౌల్ట్రీ రంగంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్, అయితే బర్డ్‌ప్లూతో పాటు ఈ ఏడాది ఎండా కాలంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో లక్షలాది కోళ్లు చనిపోయాయి. అయితే బర్డ్ ప్లూ నుంచి ఇటీవలే తేరుకున్న పౌల్ట్రీ రంగం, ఎండ కాలం కాస్తా ముగింపు దశలో ఉండడంతో కోడి మాంసానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే మార్కెట్లో డిమాండ్‌కు సరిపడ కోళ్లు లేకపోవడంతో ఇదే అదునుగా వ్యాపారులు చికెన్ ధరలను అమాంతం పెంచేశారు. దీంతో చికెన్ ప్రియుల జేబులకు ఆదివారం పెద్దత్తున చిల్లులు పడ్డాయి. కిలో చికెన్ ధర ఒక్కసారిగా రూ. 65లకు పైగా పెరగడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. మేక మాంసం దాదాపు రూ.480 నుంచి రూ.500ల వరకు ఉండడంతో సామాన్య ప్రజలందరు చికెన్ అశ్రయిస్తున్నారు. చికెన్ తిందామనుకున్న చాలా మంది దాని ధరలు భారీగా పెరగడంతో ప్రత్నామ్నాయమైన చేపల వైపు పరుగులు తీశారు. మరికొంత మంది చికెన్ ప్రియులు ఊసూరుమంటూ కిలో స్థానంలో అరకిలోతో ఇంటికి వెళ్లారు.
రానున్న కాలంలో మరింత పెరగనున్న చికెన్ ధర ః
బర్ట్ప్లూతో పౌల్ట్రీ రంగం భారీగా నష్టపోవడంతో రానున్న కాలంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటు న్నాయి. బర్డ్‌ప్లూతో ఈ రంగం తీవ్రంగా నష్టపోవడమే ఇందుకు కారణమని వారు వెల్లడించారు. అంతేకాకుండా వర్ష కాలం కావడంతో చికెన్‌కు మరింత డిమాండ్ పెరడం కూడా మరో కారణమని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఎండకాలం కావడంతో వేడి చేస్తుందన్న కారణంతో చాలా మంది చికెన్ ప్రియులు కాస్తా దూరంగా ఉన్నారు. అయితే వర్షకాలం ప్రవేశించడంతో రోజు రోజుకు చికెన్‌కు గిరాకీ పెరుగుతోందన్నారు. అయితే వినియోగ దారుల డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ధరలను పెంచడం తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఆదివారం మాంసాహా రానికి అత్యధికంగా డిమాండ్ ఉండడం సహజమని అందుకు తగ్గట్టుగా మార్కెట్లో కోళ్ల సరఫరా లేకపోవడంతో రేట్లు పెంచక తప్పలేదని వెల్లడించారు.