25వేల ఉద్యోగాలు

వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 25 వేలఉద్యోగాల భర్తీకి జులై నెలలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస...


వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 25 వేలఉద్యోగాల భర్తీకి జులై నెలలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. నియామక ప్రక్రియను వెంటనే మొదలు పెట్టి ఈ సంవత్సరం లోపే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఈ సంవత్సరం లోనే రూ. 2500 కోట్లతో 50వేల డబుల్ బెడ్ రూములను నిర్మాణం చేపడుతామని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నామని, రూ.28వేల కోట్లు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్నామని వివరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల శుభాకంక్షలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ దినోత్సవ వేడుకలు పరేగ్‌గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం తస్వీకరించారు. పోలీసుల కవాతు, వివిధ శాఖల శకటాల ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నా యి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ అనేక ఉద్యమాలు, పోరాటల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని, తొలి ఆవిర్భావ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకోవడం తనకు ఎంతో సంతో షంగా ఉందన్నారు. అందరి ఆశీస్సులతో ఒక ఏడాది పాలనను పూర్తి చేసుకు న్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం తప్పదని, కరెంటు కోతలు ఉంటాయని చేసిన అసత్యప్రచారాన్ని తిప్పికొట్టగలిగామని ఆయన చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన అర్ధ సంవత్సరంలోనే విద్యుత్ కోతలు ఆస్కారం లేకుండా చేశామని, రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫ రా చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్దిని సాధించడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించా రు. దేశంలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏర్పడేందుకు కూడా చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్రం రూ.91వేల కోట్ల పెట్టుబడులతో 2018 చివరి నాటికి మొత్తం 24 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధానికి చేరుకోవాలని లక్షంగా నిర్ణయించామని సిఎం వెల్లడించారు. దామరచెర్ల, కొత్తగూడం, మణగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్లగొండలో అల్ట్రామెగా పవర్ ప్లాంట్ సాకారం కాబోతుందని తెలిపారు. నల్గొండ కన్నీరు తుడవడానికి రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను త్వరలో నే ప్రారంభిం చనున్నామని, అదే విధంగా ఉత్తరతెలంగాణలో సాగు,తాగు నీటి కోసం రూ.30వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థా పన చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల రూ.17వేల కోట్ల పంటల రుణాల ను చిత్తశుద్ధి తో అమలు చేస్తున్నామన్నారు. అంగన్‌వాడి కార్మికులకు, హోం గార్డుల వేతనాలను పెంచామని గుర్తు చేశారు. మైనార్టీ, గిరిజనుల రిజర్వేష న్లపై కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక అందగానే, రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీరాజ్ శా ఖ ఆధ్వర్యంలో అద్భుతమైన రోడ్ల నిర్మానం చేపడుతున్నామని తెలిపారు. అనేక కార్యక్రమాల వల్లనే గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టలేకపో యామని, ఈ సంవత్సరంలోపు 50వేల డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలను చేపడుతామని తెలిపారు.
సంక్షేమంలో దేశానికే ఆదర్శం..
పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, సన్నబియ్యం, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను కూడా అమలు చేశామని తెలిపారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించామని ఆయన చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని, ఆ సంస్థ మునిగిపోతుందని అసత్య ప్రచారాలు జరిగాయని, గత పాలకుల దుష్ట పాలన వల్లనే ఆర్టీసీకి ఈ పరిస్థితి ఏర్పడిందని, కాని తమ ప్రభత్వుం ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించామని, సంస్థ అద్భుతంగా సాగేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. సంస్థకు ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రభుత్వమే గ్రాంట్‌ను అందజేసి, ఆర్టీసీని పటిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
పోలీసుల సమస్యలను పరిష్కరిస్తాను
పోలీసుల సమస్యలపై కమిటీ వేసి, వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీనిచ్చారు. రూ. 400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించామని, అందులో భాగంగానే కొత్త వాహనాలను కొనుగోలు చేశామని వివరించారు. మహిళల రక్షణ కోసం “షీ బృందాల”ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
అద్భుతమైన కార్యక్రమం మిషన్‌కాకతీయ
సమైక్య పాలకుల కుట్రలకు చెరువులు కూడా బలయ్యాయని, అందుకే చెరువుల పునరుద్దరణ కోసం మిషన్‌కాకతీయ పేరుతో అద్భుతమైన అద్భుత మైన కార్యక్రమమని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరణ చేసి వాటికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. అటవీ సంపద కూడా సమైక్య పాలనలో సన్నగిల్లిందని, ద్వంసమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చక్కని పర్యవరణాన్ని అందించేందుకు 300 కోట్ల మొక్కలను నాటేందుకు హరిత హారం కార్యక్రమన్ని చేపడుతున్నామని, జులైలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి ఐఎఎస్ అధికారుల వదరకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
కన్నుల పండువగా వేడుకలు..
డబ్పుల దరువు.. బోనాల జాతర.. పోతరాజుల నృత్యాలు.. పీర్ల ఊరేగింపు.. కళాకరుల కోలాటాలు.. ప్రదర్శనలతో తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ దినోత్సవ వేడుకలు పరడేగ్రౌండ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. బోనాల జాతర తర్వాత పీర్ల ఊరేగింపు సన్నివేశం తెలంగాణ రాష్ట్రంలో హిందూ, ముస్లిం సోదర భావన్ని చాటిచెప్పింది. రాష్ట్రంలోని పండుగలను కలిసి మెలిసి చేసుకునే సంస్కృతిని కళాకారులు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ప్రధానంగా షెడ్యుల్డు కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి పథకం అమలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శకటం పలువురిని ఎంతో ఆకట్టుకుంది. ఈ శకటంపై పెళ్లికొడుకు, పెళ్లికూతురు వివాహ ఏర్పాట్లు, పక్కనే బంధువులు, ఒక పురోహితుడు ఉన్నారు. ఈ శకటం ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్న వేదిక వద్దకు రాగానే ఆ శకటంలో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లికూతుకు తాళి కట్టిన సన్నివేశాన్నిఅ ందరూ ఎంతో ఆసక్తితో తిలకించారు. షాదిముబాకర్ పథకం పై ఏర్పాటు చేసిన ఒక శకటంపై హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌కు చెందిన వదువరులు ఉన్నారు. పౌరసరఫరా శాఖ ఆధ్వర్యంలో రూపాయికి కిలో బియ్యం పథకం అమలు తీరును కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేసిన శకటం ఎంతో ఆదరణ పొందింది. ఈ శకటంలో తల్లితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపాయి కిలో బియ్యం ద్వారా కడుపునిండా బువ్వ తింటున్న సన్నివేశాన్ని సభీకులు అభినంధించారు. గోషి గొంగడి కళాకారుల నృత్యాలు, బంజారాల నృత్యాలు, ఓగ్గుడోళుతదితర ప్రదర్శనలను సభీకులు ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్ మెట్రో రైల్ నమూనాతో ఒక శకటాన్ని ఏర్పాటు చేశారు. మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం, వ్యవసాయం, ఉద్యానశాఖ శాఖల శకటాలు ఆకర్షణగా నిలిచాయి.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: 25వేల ఉద్యోగాలు
25వేల ఉద్యోగాలు
http://3.bp.blogspot.com/-fIeukdqUywg/VY2ABsrqmTI/AAAAAAAAGVA/CNfvJIrkTPQ/s400/jobs-300x225.jpg
http://3.bp.blogspot.com/-fIeukdqUywg/VY2ABsrqmTI/AAAAAAAAGVA/CNfvJIrkTPQ/s72-c/jobs-300x225.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/25.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/25.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy