హైదరాబాద్ : అతి వేగంగా, అత్యంత తీవ్రతతో సన్ సైక్లోన్ భూమిని తాకనుందని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ నెల 28న సన్ సై...
హైదరాబాద్ : అతి వేగంగా, అత్యంత తీవ్రతతో సన్ సైక్లోన్ భూమిని తాకనుందని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ నెల 28న సన్ సైక్లోన్ (సౌర తుఫాను) భూమిని తాకనుందని హెచ్చరించారు. సౌర తుఫాను భూ మండలాన్ని తాకితే భూమిపై వినియోగ వ్యవస్థ పనిచేయదని, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిచిపోతాయని చెబుతున్నారు. గంటకు 16 లక్షల 9 వేల 347 కిలో మీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొస్తున్న ఈ సైక్లోన్ తాకిడిని కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే కనుగొనగలమని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే సన్ సైక్లోన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సన్ సైక్లోన్ తాకిడి తీవ్రతను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. సూర్యుడి నుంచి శక్తివంతమైన వేడి వెలువడుతున్నప్పుడు అది సైక్లోన్‌గా మారి అంతరిక్షంలో వరదలా దూసుకొస్తుందని, అది భూమిని తాకినట్లైతే పెనుప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పుడప్పుడు ఇటువంటి సైక్లోన్లు వస్తుంటాయని తెలిపారు.
