(26 Jun) సికింద్రాబాద్ : నగరం నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 28న రద్దు చేస్తున్నట్టు దక్షిణ...
(26 Jun) సికింద్రాబాద్ : నగరం నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 28న రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఇటార్సీ రైల్వే స్టేషన్‌లోని రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా... ఈ రైైలును రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే 32 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జూలై నెలలో తాత్కాలికంగా అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా... 18,400 అదనపు బెర్తులు అందుబాటులోకి వస్తాయని ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్-నర్సాపూర్ (రైల్ నెంబర్ 17256)కు... జూలై 1 నుంచి 10వ తేదీ వరకు... ఒక ఏసీ త్రీ టైర్ బోగీ ఏర్పాటు నర్సాపూర్-హైదరాబాద్ (రైల్ నెంబర్ 17255)కు జూలై 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు...ఒక ఏసీ త్రీ టైర్ బోగీ ఏర్పాటు హైదరాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17230)కు జూలై 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక ఏసీ త్రీ టైర్ బోగీ ఏర్పాటు త్రివేండ్రం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17229)కు జూలై 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక ఏసీ త్రీ టైర్ బోగీ ఏర్పాటు సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17016)కు జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు... ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17015)కు జూలై 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17250)కు జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17249)కు జూలై 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు సికింద్రాబాద్-దర్భంగ ఎక్స్‌ప్రెస్ (17007)కు జూలై 4, 7వ తేదీల్లో ఏసీ టూ టైర్ బోగీ ఏర్పాటు దర్భంగ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17008)కు జూలై 7, 10 తేదీల్లో ఒక ఏసీ టూ టైర్ బోగీ సికింద్రాబాద్-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17002)కు జూలై 5న ఒక ఏసీ టూ టైర్ బోగీ సాయినగర్ షిర్డీ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17001)కు జూలై 6న ఒక ఏసీ టూ టైర్ బోగీ సికింద్రాబాద్-తిరుపతి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12770)కు జూలై 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక ఏసీ టూ టైర్ బోగీ ఏర్పాటు తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12769)కు జూలై 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఒక ఏసీ టూ టైర్ బోగీ ఏర్పాటు హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17429)కు జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు తిరుపతి-హైదరాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 17430)కు జూలై 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు.