(24 Jun) మూడు దశల్లో అక్రిడేషన్లు హైదరాబాద్ : విలేకరులకు, డెస్క్ జర్నలిస్టులకు మూడు దశల్లో అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రెస్ అ...
(24 Jun) మూడు దశల్లో అక్రిడేషన్లు
హైదరాబాద్ : విలేకరులకు, డెస్క్ జర్నలిస్టులకు మూడు దశల్లో అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. అక్రిడేషన్ కార్డుల జారీపై అక్రిడేషన్ కార్డుల కమిటీ అల్లం నారాయణ అధ్యక్షతన ఇవాళ భేటీ అయింది. ఈ సందర్భంగా అక్రిడేషన్ కార్డుల జారీ విధానాలపై చర్చించారు. పాత అక్రిడేషన్లు ఉన్నవారికి ఈ నెల 30 లోగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఈ దఫా డెస్క్‌లో పని చేసే జర్నలిస్టులకూ అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇస్తామని తెలిపారు.