(25 Jun) ఢిల్లీ: మరో 48 గంటల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్లు భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో వర్షాలు ప...
(25 Jun) ఢిల్లీ: మరో 48 గంటల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్లు భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో వర్షాలు పలు ప్రాంతాల్లో జల్లులుగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురువనున్నాయి. పర్యాటక రాష్ర్టాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆరెంజ్ అలెర్ట్(రెడ్ అలెర్ట్కు కొంచెం తక్కువగా ఉన్న ప్రమాదం)ను ప్రకటించింది. జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చినట్లు భారత వాతావరణశాఖ డైరెక్టర్ బి.పి. యాదవ్ తెలిపారు.