గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 58 ప్రత్యేక రైళ్లను నడుప నుంది. వీటితో పాటు గోదావరి మార్గంల...
గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 58 ప్రత్యేక రైళ్లను నడుప నుంది. వీటితో పాటు గోదావరి మార్గంలో వెళ్లే 16 రైళ్లకు అదనంగా ఎసి టూ టైర్, ఎసి త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లను జత చేయనున్నారు. కాకినాడ – హైదరాబాద్ (07701) ప్రత్యేక రైలు జులై 12, 16, 20, 24వ తేదీల్లో రాత్రి 11 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ – కాకినాడ (07702) ప్రత్యేక రైలు జులై 13, 17, 21, 25 తేదీల్లో హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ – హైదరాబాద్ ప్రత్యేక రైలు (07703) జులై 14, 18, 22, 26 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కి హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో హైదరాబాద్ -కాకినాడ (07704) ప్రత్యేక రైలు జులై 15, 19, 23, 27వ తేదీల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటుంది. ఇరుమార్గాల్లో ఈ రైళ్లు కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో రెండు ఎసి టూ టైర్, రెండు ఎసి త్రీ టైర్, 10 స్లీపర్ క్లాస్, ఒక సెకెండ్ క్లాస్ ఛైర్ కార్, రెండు జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్, రెండు సెకెండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లుంటాయి.
హైదరాబాద్ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు జులై 14, 18, 22, 26 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15కు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ – హైదరాబాద్ ప్రత్యేక రైలు జులై 15, 19, 23, 27 తేదీల్లో మధ్యాహ్నం 1.15 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇరుమార్గాల్లో ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో రెండు ఎసి టూ టైర్, రెండు ఎసి త్రీ టైర్, 12 స్లీపర్ క్లాస్, రెండు జనరల్ సెకెండ్ క్లాస్, రెండు సెకెండ్ క్లాస్ లగేజ్కమ్ బ్రేక్ వ్యాన్ లుంటాయి. వీటితో పాటు తిరుపతి – పార్వతీపురం -ధర్మవరం 8, ధర్మ వరం – విశాఖపట్నం – తిరుపతి 8, విజయ వాడ – విశా ఖపట్నం 8, అనకాపల్లి – మచిలీపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్ల ను నడుపనున్నా రు. ప్రత్యేక రైళ్లకు సంబంధించి రిజ ర్వేషన్ బుకింగ్ సౌకర్యం ఈనెల 28 నుంచి అందుబాటులో ఉంటుందని ముఖ్య పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.