(23 Jun) కలకత్తా, జూన్ 23 : మదర్‌థెరిస్సా శిష్యురాలు సిస్టర్ నిర్మల(81) కన్నుమూశారు. గతంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా సి...
(23 Jun) కలకత్తా, జూన్ 23 : మదర్‌థెరిస్సా శిష్యురాలు సిస్టర్ నిర్మల(81) కన్నుమూశారు. గతంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా సిస్టర్ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో మదర్‌థెరిస్సా తరువాత ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు స్వీకరించారు. నిర్మల 1934, జూలై 23న రాంచిలో జన్మించారు. నేపాల్ నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సిస్టర్ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని క్రైస్తవ సన్యాసం తీసుకున్నారు. 2009లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని నిర్మల అందుకున్నారు. నిర్మల మృతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు. సిస్టర్ నిర్మలను ప్రపంచం కోల్పోయిందని మమతా ట్వీట్ చేశారు.