(30 Jun) న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి బండారు ద...
(30 Jun) న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చట్టంలో పేర్కొన్న అంశాలను పర్యవేక్షించే బాధ్యతను గవర్నర్ నరసింహన్ చూస్తున్నారని చెప్పారు. సెక్షన్-8 అంశంలో కూడా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని, కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రజలంతా సంతోషంతో ఉన్నారని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రెండు రాష్ర్టాల మధ్య ఏదైనా వివాదం వచ్చినా, భిన్నాభిప్రాయం వచ్చినా గవర్నర్ జోక్యం చేసుకుంటారు తప్ప కేంద్రం వేలు పెట్టదని స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల మధ్య ఏదైనా సమస్య వస్తే గవర్నర్ చొరవ తీసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడుతారని అన్నారు.