(28 Jun) పరీక్ష నిమిత్తం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు శాంపిల్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బ్యా...
(28 Jun) పరీక్ష నిమిత్తం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు శాంపిల్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా దాగి ఉందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కేఎఫ్‌సీ ఉత్పత్తులను పరీక్ష నిమిత్తం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపింది. ఐపీఎం డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ ఇన్స్పెక్టర్లు 14 శాంపిల్స్‌ను సేకరించారని, వాటిని పరీక్షిస్తున్నామని, బుధవారం నాటికి ఫలితం వస్తుందని చెప్పారు. కేఎఫ్‌సీ ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందని ఆరోపించిన స్వచ్ఛంద సంస్థ కూడా శాంపిల్‌ను అందచేసిందని, కానీ తాము దానిని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.