మందు బాబులకో శుభవార్త.. ఏంటా అనుకుంటున్నారా.. విషయమేంటంటే హైదరాబాద్ టూరిజంను డెవలప్ చెయ్యడానికి, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి తెలం...
మందు బాబులకో శుభవార్త.. ఏంటా అనుకుంటున్నారా.. విషయమేంటంటే హైదరాబాద్ టూరిజంను డెవలప్ చెయ్యడానికి, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి తెలంగాణ సర్కార్ మందును మరింత అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ముందు మందు 24 గంటలు అందుబాటులో ఉంచాలని అనుకున్నా తర్వాత మాత్రం తెల్లారి మూడింటి నుండి ఆరింటి వరకు మాత్రం గ్యాప్ ఇచ్చారు. మొత్తానికి ఇక 24 గంటల్లో ఓ మూడు గంటలు తప్ప మిగిలిన టైంలో మందు దొరుకుంది. ఇక మందు తాగి మజా చెయ్యాలనుకున్న జల్సా రాయుళ్లకు పండగే పండగ.
ముందైతే మందు బాబుల కష్టాల గురించి చెప్పక్కర్లేదు. కనీసం మనస్పూర్తిగా మందు తాగుదామని అనుకునే మందు బాబులకు రాత్రి పదకొండు దాటితే మందు కరువు, మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు గానీ మందు దొరకదు. కానీ ఇక మీదట మాత్రం అంత బాధపడక్కర్లేదు. జేబులో డబ్బులు ఉండాలే కానీ హైదరాబాద్ లో మందు ఎక్కడైనా దొరుకుతుంది. తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకువస్తున్న పాలసీ పుణ్యమా అని మందు బాబులకు పూటుగా మందు దొరికే అవకాశం లభిస్తోంది.
