(24 Jun) సిరియాలో ఐసిస్ దుశ్చర్య డెమాస్కస్: సిరియాలోని పాల్మిరా నగరంలో ఐసిస్ ఉద్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రెండు పురాతన సమాధులను ...
(24 Jun) సిరియాలో ఐసిస్ దుశ్చర్య
డెమాస్కస్: సిరియాలోని పాల్మిరా నగరంలో ఐసిస్ ఉద్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రెండు పురాతన సమాధులను పేల్చి వేశారు. ఈమేరకు జూన్ 22, 2015న మిలిటెంట్లు తమ వెబ్సైట్లో ఒక సమాధిని పేల్చివేస్తున్నట్టుగా ఉన్న ఫోటోను విడుదల చేశారు. దీనిపై ఎలాంటి తేదీని పేర్కొనలేదు. అయితే సిరియా పురావస్తు, మ్యూజియం శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఫోటోలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు పేల్చి వేసిన సమాధి మహ్మద్ ప్రవక్తకు కజిన్ ఇమామ్ ఆలీకి చెందిన మహ్మద్ బిన్ ఆలీది అని వెల్లడించారు.