ములకలపల్లి: వామపక్షాలది నాటి నుంచి నేటి వరకు కార్మిక పక్షనా పోరాడుతుందని, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకోవడానికి ...
తొలుత సంఘం జెండాను సీనియర్ నాయకులు యలమద్ది కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళి ఆర్పించి మౌనం పాటించారు. ఈ మహాసభలో బాగం మాట్లాడుతూ సమావేశంలో ఆనాటి నుంచి నేటి వరకు పేదలు చేస్తున్న భూమి కోసం, భుక్తి కోసం చేస్తున్న పోరాటాల్లో సిపిఐ వారికి అండగా నిలబడిందన్నారు. ఆనాటి దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య అశువులు బాసారని ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడితే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని, అందరి జీవితాలు బాగు పడతాయని భావించామని, అందుకే తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని సిపిఐ ముఖ్యపాత్ర పోషించిందన్నారు.
మన అందరి కృషి ఫలితంగా తెలంగాణ వచ్చింది కాని మన సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ బడా పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాల భూములను పరిశ్రమల పేరుతో ధారదత్తం చేస్తూ భుక్తి కోసం గిరిజనులు పోడు సాగు చేసుకుంటుంటే వాటిని లాక్కువాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. హరిత హారం పేరుతో కెసిఆర్, భూ సంస్కరణ చట్టం పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. పాలకుల విధానాలను తాము చూస్తూ ఊరుకోమన్నారు.
వ్యవసాయ కార్మికు సమస్యల పరిష్కారానికి వారి పక్షాన నిలబడి నిరంతర పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల్లో బికెఎంయు రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటరాములు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మండె వీరహనుమంతరావు, బికెఎంయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యర్రాబాబు, తాటి వెంకటేశ్వరరావు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు తాటి నిర్మల, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం, మండల కార్యదర్శి నరాటి ప్రసాద్, మండల నాయకులు సంగు సమ్మయ్య, నెల్లూరి నర్సింహారావు, నరాటి రమేష్, నాగేష్, పద్దం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.