నిధులు.. రోడ్డు పాలు..

జాతీయ రహదార్ల నిర్మాణం ప్రహసనంగా మారుతోంది. పేరుకు దిల్లీ స్థాయివైనా.. గల్లీరోడ్లకున్న నాణ్యత కూడా కనిపించడం లేదుఅధికారులు.. గుత్తేదారులు...

nidhulu..
roddu paalu..
జాతీయ రహదార్ల నిర్మాణం ప్రహసనంగా మారుతోంది. పేరుకు దిల్లీ స్థాయివైనా.. గల్లీరోడ్లకున్న నాణ్యత కూడా కనిపించడం లేదుఅధికారులు.. గుత్తేదారులు కలిసిపోతే నిర్మాణాలు ఎలా ఉంటాయని చెప్పడానికి 63వ నెంబరు జాతీయ రహదారి పనులే నిదర్శనం. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇది ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాకుండానే ధ్వంసమైంది. కొత్తగా నిర్మిస్తే తప్ప ఉపయోగపడని స్థితికి చేరింది. దీన్ని నిర్మించేందుకు ఇప్పటి వరకు చేసిన రూ.కోట్ల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అయింది.తెెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ప్రజల కల సాకారం కాకముందే రహదారి ఆనవాళ్లు కోల్పోతోంది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇప్పుడు ఆ రహదారి పూర్తిగా పాడైపోయి గుంతలమయమై మట్టి రోడ్డును తలపిస్తోంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా రోడ్డంతా ధ్వంసమైంది. రహదారికి పగుళ్లు ఏర్పడటమే కాకుండా ఏకంగా కిందకు కుంగిపోయింది. ఈ రహదారిని 'ఈనాడు' పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది.నిజామాబాద్‌ జిల్లా నుంచి ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా చత్తీస్‌ఘడ్‌లోని జగ్ధల్‌పూర్‌ వరకు ఒకప్పటి 16వ జాతీయ రహదారి ప్రస్తుత 63వ నెంబరు రహదారి పనులు చేపట్టారు. ఈ రహదారి ఎక్కువగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోనే నిర్మించాల్సి ఉండటంతో గుత్తేదారుల మధ్య పోటీ లేకుండా పోయింది. ఈ పనులు చేసేందుకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఒకరిద్దరు గుత్తేదారులు ముందుకు వచ్చినా.. మావోయిస్టులు వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణాన్ని సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ(బీఆర్వో)కు అప్పగించింది. ప్రస్తుతం తెలంగాణలోని నిజామాబాద్‌ నుంచి చత్తీస్‌ఘడ్‌లోని జగ్ధల్‌పూర్‌వరకు ఈ జాతీయరహదారి సుమారు 560కి.మీ నిడివి ఉంది. జిల్లాలోని చెన్నూరు మండలంలోని లింగంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు కోటపల్లి మండలం (అర్జున్‌గుట్ట) వరకు 28కి.మీ, మహారాష్ట్రలోని సిరోంచ నుంచి పాతగూడెం వరకు 70కి.మీ నిర్మించాలి. నాలుగు కిలోమీటర్లు మినహా మన రాష్ట్రంలో పనులు పూర్తిచేశారు.రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టే కంటే ముందే వాటికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి. కానీ.. ఇప్పటికే కొంత మేరకు పనులు కొనసాగించిన తర్వాత అటవీ అనుమతులు రాలేదని నిలిపేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనే 1650 మీటర్ల పొడవున అటవీప్రాంతం నుంచే రహదారిని నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారి మొదలయ్యే చెన్నూరు మండలం లింగంపల్లి వద్ద దాదాపు 300మీటర్ల పొడవున అటవీ అనుమతుల్లేక పనులు ఆగిపోయాయి. వాటితోపాటు చింతలపల్లి గ్రామ చివర నుంచి పారుపల్లి వరకు 650మీటర్లు, కోటపల్లి మండలం బోరంపల్లి నుంచి ఎర్రాయిపేట వరకు 700మీటర్ల పొడవున రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ఎంపీ, మంత్రుల బృందంతో కలిసి అటవీ అనుమతులు, నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ బాల్కసుమన్‌ ఇటీవల మంచిర్యాలలో ప్రకటించారు. అటవీ అనుమతులు లేని చోటే కాకుండా మిగిలిన కొన్ని చోట్లా పనులు అసంపూర్తిగానే మిగిలాయి. కోటపల్లి మండలం లక్ష్మీపూర్‌ నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి విస్తరణ వరకు ఎటువంటి ఆటంకాలు లేకున్నా.. దాదాపు 2.5కి.మీ దూరం రహదారి పనులు చేపట్టలేదు. అంతేకాకుండా ప్రాణహిత నదిపైన వంతెన నిర్మాణం కూడా పూర్తిచేయలేదు. మహారాష్ట్ర ప్రభుత్వమే దీనిని చేపట్టాల్సి ఉంది.జాతీయ రహదారి విస్తరణ పనుల నిర్వాహణలో తీవ్ర జాప్యమే వాటిల్లింది. పలు చోట్లా అసంపూర్తిగా దర్శనమిస్తుండగా .. మరోవైపు చేసిన పనులు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో అప్పుడే వాటి ఆనవాళ్లు కోల్పోయింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బీఆర్వో సిబ్బంది ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి పూర్తిచేసిన మట్టి, సిమెంటు, తారు రోడ్డు నిర్మాణ పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. నిర్మాణ దశలోనే అనేక చోట్లా పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్లా రహదారి ఎందుకు పనికిరాకుండా తయారైంది. మట్టి పనుల్లోనూ సక్రమంగా నీటితో తడపడం, అణగదొక్కడం చేయకపోవడంతో రహదారి పాడైపోయింది. బీఆర్వో అధికారులు సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడంతోపాటు అనుభవం లేని సిబ్బందిని వినియోగం, నాసిరకమైన ముడిసరకును వాడారన్న ఆరోపణలున్నాయి. చెన్నూరు మండలం ఎర్రకాలనీ శివారు నుంచి చింతపల్లి వరకు తారు (బీటీ) పూర్తిగా లేచిపోయింది. కంకర కూడా లేచిపోయి గుంతలమయంగా మారింది. కోటపల్లి మండలం పారుపల్లి, ఎర్రాయిపేట, కొల్లూరు, రాంపూర్‌ గ్రామాల మధ్యలో రోడ్డు కుంగిపోయింది.రహదారి విస్తరణ సమయంలో తొలుత గట్టి మట్టి (హార్డ్‌సాయిల్‌)వచ్చే వరకు పొక్లేయిన్లతో తవ్వకుండానే పైపూత పనులు చేపట్టారు. తర్వాత మట్టితో వరుసలుగా వేస్తూ.. దానిపైన తడుపుతూ, అణగతొక్కుతూ పనులు చేపట్టాల్సి ఉన్నా.. కుప్పలు కుప్పలుగా ఒకేసారి పోసి చదును చేశారు. ఆ తర్వాత వాటిపైన కంకర, తారువేయడంలో గుత్తేదారులు కక్కుర్తి పడ్డారు. జాతీయ రహదారి పనులు తమ పరిధిలో లేవంటూ జిల్లా అధికారులెవరూ పర్యవేక్షించలేదు. కళ్లముందే నాసిరకమైన పనుల ఆనవాళ్లు కనపడుతున్నాన్నా.. తమకెందుకులే అంటూ పక్కకు తప్పుకొంటున్నారు. ఒకరిద్దరికి పర్యవేక్షణకు విధులు అప్పగించినా.. వాళ్లు కూడా గుత్తేదారులతో కలిసిపోతున్నారు. వారికి కావాల్సిన మామూళ్లు తీసుకొని అంతా బాగుందంటూ కితాబివ్వడమే వారి పనిగా మారింది. మామూళ్లిచ్చి ప్రశ్నించే నేతల నోర్లు మూయిస్తున్నారు. ఈ జాతీయరహదారి పనులు ప్రారంభమైనప్పటి నుంచే ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకొని ఉంటే ఇలా జరిగిఉండేది కాదు. ఇప్పుడు నిర్మల్‌ నుంచి మహారాష్ట్రలోని కళ్యాణి వరకు జరుగుతున్న జాతీయ రహదారి-61 విస్తరణ పనులు సైతం నాసిరకంగా జరుగుతున్నాయి. ఈ పనుల తీరును ఇప్పటికే 'ఈనాడు' పలు మార్లు వెలుగులోకి తీసుకొచ్చినా.. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం భేష్‌ అంటున్నారు. ఎన్‌హెచ్‌-61 పనులు కూడా ఎన్‌హెచ్‌-63 మాదిరిగా కాకుండా ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలిస్తే వారికి సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేదని తేటతెల్లమవుతోంది. వర్షపు నీరు వెళ్లిపోయేందుకు రహదారి పొడవున కల్వర్టులు, చిన్నచిన్న వంతెనలు నిర్మించారు. రహదారి ఎత్తును పరిగణలోకి తీసుకొని కల్వర్టుల ఎత్తును నిర్ణయించడమో.. కల్వర్టు ఎత్తును బట్టి రహదారి ఎత్తును నిర్ణయించడమో చేయాలి. కానీ.. ఇక్కడ ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారో తెలియదు కానీ.. రహదారి కిందకు ఉంటే కల్వర్టులు మాత్రం ఎత్తుగా ఉన్నాయి. లింగంపల్లి, రాంపూర్‌, ఎర్రాయిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వంతెనలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అక్కేపల్లి, బతుకమ్మవాగుపై నిర్మించిన వంతెనకు సిమెంటు కొట్టుకుపోయి ఇనుపచువ్వలు పైకి తేలాయి. రహదారి కుంగిపోవడం వల్లే వంతెన ఎత్తు పెరిగిందని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి రహదారి పనులు ఎంత అద్వానంగా జరిగాయో తెలుసుకోవచ్చు. రహదారి కంటే వంతెనలు జానెడు ఎత్తులో ఉండటంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలువురు గాయపడటమే కాకుండా మృత్యువాత పడ్డారు.ఓ వైపు పనులే నాసిరకంగా జరిగాయని.. వాటికి ఎంతగా మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదని నిపుణులు సూచిస్తున్నా.. మళ్లీ మరమ్మతుల పేరుతో రూ.కోట్లు వృథా చేస్తున్నారు. చెన్నూరు మండలం చింతలపల్లి నుంచి చెన్నూరు బైపాస్‌ వరకు మరమ్మతులకు రూ.11కోట్లు కేటాయించారు. పునాదే ప్రతిష్టంగా నిర్మించలేదనే విమర్శలు వస్తున్న తరుణంలోనే మరమ్మతుల పేరుతో వేసే అతుకులు కూడా బాగా ఉండవనే విమర్శలున్నాయి. మరమ్మతులు కూడా దారుణంగానే జరుగుతున్నాయి. పాత రహదారి కంకర తీసి మళ్లీ దానినే వాడుతున్నారు. తడపడం, మట్టి అణచడం సక్రమంగా చేయడంలేదు. విస్తరణకు గట్టి మొరాన్ని ఉపయోగించడం లేదు. పనులు ప్రారంభించకుండానే రూ.కోట్లల్లో మరమ్మతులకు తగలేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనుల గురించి కనీస వివరాలు చెప్పేందుకు.. నాసిరకమైన పనులపైన వివరణ ఇచ్చేందుకు సంబంధిత ఈఈ, డీఈలు స్పందించలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, నేతలు విచారణ జరిపిస్తే అనేక అవినీతి అక్రమాలు కుప్పలు తెప్పలుగా బయటపడే అవకాశం ఉంది.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: నిధులు.. రోడ్డు పాలు..
నిధులు.. రోడ్డు పాలు..
http://acdn.newshunt.com/fetchdata5/20150616/eena/adilabad/images/350x350_IMAGE40815946.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_17.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_17.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy