పాన్గల్: మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలం బొల్లారంలోని పెద్దచెరువులో గురువారం ఓ మొసలి లభ్యమైంది. కొన్నినెలలుగా ...
పాన్గల్: మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలం బొల్లారంలోని పెద్దచెరువులో గురువారం ఓ మొసలి లభ్యమైంది. కొన్నినెలలుగా పెద్దచెరువులో మొసలి సంచరిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కొంతకాలంగా మిషన్ కాకతీయ కింద పనులు చేసేందుకు మడుగుల్లో నిల్వ ఉన్న నీటిని తోడేశారు. అయినప్పటికీ ఓ మడుగులోకి మొసలి చేరింది. ఇటీవల మడుగులో నీరు తాగేందుకు వెళ్లిన ఓ గొర్రెపిల్లను చంపివేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మడుగులోని నీటిని పూర్తిగా తోడేసి మొసలిని బంధించి గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని కొల్లాపూర్ అడవుల్లోని కృష్ణాతీరంలో వదిలేశారు.
