రాష్ట్ర సరిహద్దులో మారనున్న మావోల ప్రభావం సీకాస చైర్యలు సైతం అదుపులోకి 3.10ఎకరాల్లో ఏర్పడనున్న కమిషనరేట్ త్వరలో ప్రారంభించనున్న హోంమ...
- రాష్ట్ర సరిహద్దులో మారనున్న మావోల ప్రభావం
- సీకాస చైర్యలు సైతం అదుపులోకి
- 3.10ఎకరాల్లో ఏర్పడనున్న కమిషనరేట్
- త్వరలో ప్రారంభించనున్న హోంమత్రి నాయిని
మంచిర్యాల టౌన్ : జిల్లాలో అన్ని హంగులను సంతరించుకున్న మంచిర్యాలలో నూతన కమీషనరేట్ ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి. దీని కోసం ఇటీవలే పోలీసులు నస్పూర్ వద్ద 3.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ అధికారుల సహాయంతో ఈ ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు సైతం నివేదించారు. అయితే రాష్ట్ర సరిహద్దు మంచిర్యాలకు దగ్గరగా ఉండటంతో ఈ కమీషనరేట్ ఏర్పాటు తూర్పులో శాంతిభద్రతలను మార్చనున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు తూర్పు జిల్లా నుంచి ప్రదాన మార్గాలున్నాయి. మహారాష్ట్రతో పాటు చత్తీస్గడ్కు అనుసందానంగా ఉన్న తూర్పు జిల్లాకు మావోల సంచారంతో పాటు స్థానిక ఏరియాలో సింగరేణి నెలకొని ఉండటంతో సికాస ప్రాభల్య చర్యలు సైతం ఎక్కువగానే ఉంటూ వచ్చాయి. అయితే ఈ నూతన కమీషనరేట్ ఏర్పాటుతో ఈ మావోల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. చత్తీస్గడ్ నుంచి జిల్లా సరిహద్దులోకి ప్రవేశద్వారాలకు మూత పడనుంది. ఎందుకంటే తూర్పు జిల్లా మొత్తంగా మంచిర్యాల ప్రధాన కేంద్రంగా ఉండనుంది. దీంతో పోలీసు కార్యకలాపాలు అదికంగా ఉండి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు వేగంగా అందడం , ఆ తదుపరి నిర్ణయాలు సైతం అతివేగంగా అందే అవకాశం ఉండటంతో మావోల కార్యకలాపాలు తగ్గే సంకేతాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే నేరాలు, ఘోరాలు సైతం పూర్తిగా అదుపులోకి వచ్చేలా ఈ కమీషనరేట్ ఏర్పాటుతో పటాపంచలు కానున్నాయి. పెద్ద స్థలంలో కమీషనరేట్ ఏర్పాటు చేస్తే పోలీసు హెడ్క్వార్టర్గా మంచిర్యాల పోలీసుల పర్యవేక్షణకు వెళ్లనుంది. అయితే త్వరలోనే ఈ కమీషనరేట్ పూర్తి స్థాయి ఏర్పాట్లకు అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించనున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన మంచిర్యాలలో పర్యటించి ఈ విషయాన్ని తేటతెల్లం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, సీసీసీ, మంచిర్యాల ఒకే వింగ్లోకి వచ్చేందుకే ఈ పోలీసు కమీషనరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.