హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం నేడు రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు...
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం నేడు రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదుకు అనుమతివ్వాలంటూ ఏసీబీ అధికారులు గత వారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఏసీబీ అధికారులు మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం 164 సీఆర్పీసీ కింద స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు చేసేందుకు కోర్టునుంచి అనుమతి లభించింది. ఏసీబీ అధికారులు బుధవారం మేజిస్ట్రేట్ ముందు స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు చేయించనున్నారు. కేసు తీవ్రతను బట్టి స్టీఫెన్సన్ కోర్టుకు వచ్చే సమయంలో, ఆ తర్వాత అతని భద్రతపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.