(24 Jun) బ్రిటన్లో జాత్యహంకారి జాక్ డేవీస్.. భారతీయుడైన శరన్దేవ్ భాంబ్రాపై మారణాయుధాలతో దాడి బ్రిటన్లో ఒక భారతీయుడిపై జాత్యాహంకార ద...
(24 Jun) బ్రిటన్లో జాత్యహంకారి జాక్ డేవీస్.. భారతీయుడైన శరన్దేవ్ భాంబ్రాపై మారణాయుధాలతో దాడి బ్రిటన్లో ఒక భారతీయుడిపై జాత్యాహంకార దాడి జరిగింది. గత జనవరి 14వ తేదీన వేల్స్లోని మోల్డ్ నగరంలో జాత్యహంకారి జాక్ డేవీస్.. భారతీయుడైన శరన్దేవ్ భాంబ్రాపై మారణాయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో శరన్దేవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఈ దాడిలో భారతీయుడిని చంపేందుకు నిందితుడు యత్నించలేదన్న మోల్డ్ క్రౌన్ కోర్టు అభిప్రాయపడి, నిందితుడిపై హత్యాయత్నం ఆరోపణలను తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగానే జాక్ దాడి చేశాడని చెప్పిన కోర్టు, ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించలేదు. దీంతో ఆ దేశ కోర్టు జాత్యహంకార దాడులను ప్రోత్సహించేలా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.