(30 Jun) బీజింగ్, జూన్ 29: ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చైనా మహాకుడ్యం క్రమంగా కనుమరుగవుతున్నదని బీజింగ్ టైమ్స్ అనే వార్తా సంస్థ పేర్కొ...
(30 Jun) బీజింగ్, జూన్ 29: ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చైనా మహాకుడ్యం క్రమంగా కనుమరుగవుతున్నదని బీజింగ్ టైమ్స్ అనే వార్తా సంస్థ పేర్కొంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మానవుల బాధ్యతారహితమైన కార్యకలాపాల కారణంగా ఈ ప్రపంచ వారసత్వ సంపద ధ్వంసమవుతున్నదని తెలిపింది. ఈ గోడలోని ఇటుకలను చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇండ్లు కట్టుకునేందుకు దొంగిలిస్తున్నారని పేర్కొంది. తూర్పు తీరంలోని షాన్హైగువాన్ నుంచి గోబీ ఎడారి అంచున జియాగువాన్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పొడవున ఈ మహాకుడ్యాన్ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 9,000 నుంచి 21 వేల కిలోమీటర్లు ఉంటుందని ఓ అంచనా. అయితే అంతరిక్షం నుంచి చూసినప్పుడు మధ్యలో కొంతభాగం అదృశ్యమైనట్టు కనిపిస్తున్నదని ఆ పత్రిక తెలిపింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో ఈ గోడ నిర్మాణం ప్రారంభమైందని చెబుతారు. మింగ్ రాజ వంశం కాలం (1368-1644)లో 6,300 కిలోమీటర్ల పొడవున గోడ నిర్మాణం జరిగింది. ఈ భాగంలోనే గత కొన్ని శతాబ్దాల కాలంలో 1,962 కిలోమీటర్ల మేర గోడ కనుమరుగైందని బీజింగ్టైమ్స్ తెలిపింది.