బోధన్డివిజన్ (నిజామాబాద్): మొత్తం 390 మార్కులు వచ్చాయి. గణితంలో 20 మార్కులు వచ్చినట్లు చూపారు. అది కూడా టాలీ అవ టం లేదు. స్కూల్ టాపర్ గ...
బోధన్డివిజన్ (నిజామాబాద్): మొత్తం 390 మార్కులు వచ్చాయి. గణితంలో 20 మార్కులు వచ్చినట్లు చూపారు. అది కూడా టాలీ అవ టం లేదు. స్కూల్ టాపర్ గణితంలో టాపర్.. గణితంలోనే ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీనిపై రివల్యూషన్ కోసం వెంటనే డబ్బులు కట్టాడు.
16 పేజీలకు 8 పేజీలు మాత్రమే ఉన్నాయి: విద్యాశాఖ అధికారుల నిర్లక్షం ఓ విద్యార్థి విద్యా జీవితాన్ని బుగ్గిపాలు చేసింది.. ఎప్పుడూ పాఠశాల టాపర్‌గా.. అందులోనూ గణితంలో మేటిగా నిలిస్తూ వచ్చి న విద్యార్థిని, చివరికి గణితంలో ఫెయిలయ్యాడని తప్పుడు ఫలితాలు వెలువర్చారు. విద్యార్థి పాలిసెట్‌లో ఉత్తమ మార్కులతో పాసైనా. వి ద్యాశాఖ అధికారుల నిర్లక్షానికి పాలిసెట్‌లో చేరే అవకాశం కోల్పో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిండు విద్యా జీవితానికి పునాదిగా పేరు కునే ఎస్ఎస్సి ప్రథమ తరగతిలో పాసైనట్లు దృవపత్రం అందుకోనే స్థానంలో ఫెయిల్ దృవపత్రం అందుకునే దుస్థితి ఏర్ప డింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం నివాసి నర్సింలు కుమారుడు భరత్ శ్రీనలంద పాఠశాలలో పదవ తరగతి వరకు చదు వుకున్నాడు. కోటగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇతనికి సెంటర్ ప డింది. భరత్ చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో పాఠశాల టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. గణితం సబ్జెక్టులో అయితే ఇతని ప్రతిభ అపారం. అయితే విద్యాశాఖ అధికారుల నిర్లక్షం వల్ల ఎస్సెస్సీ పరీక్ష ఫలితా ల్లో గణితం సబ్జెక్టులోనే ఫెయిలైనట్లు ఫలితాలు వెలువడ్డాయి.

ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించిన భరత్ తల్లిదండ్రులు రివల్యూ షన్ కోసం మే 19వ తేదీన దరఖాస్తు చేశారు. ఫలితాలు బేరీజు వేయ టంలో నిర్లక్షం వహించిన సదరు అధికారులు రివల్యూషన్ వివరా లు పండటంలోనూ అలసత్వం వహించారు. రివల్యూషన్పై ఆశలు వదులుకున్న సదరు విద్యార్థి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో జూన్ 23వ తేదీన విద్యాశాఖ అధికారులు రివల్యూషన్ వివరాలు పంపారు. ఆ వివరాలు చూసిన భరత్, అతని తల్లిదండ్రులు నోరెళ్లబెట్టారు. గణితంలో భరత్ మెయిన్, అడిషనల్స్ కలిపి మొత్తం 16 పేజీలు రాయగా పేపర్లు మాత్రమే చూపారు. మొదటి పేపర్లో 10 మార్కులు, రెండో పేపర్లో 10 మా ర్కులు లెక్కకట్టారు. ఆ లెక్కలు కూడా తప్పుగానే కట్టినట్లు వివరాలు చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. దీంతో లబోదిబో మంటూ భర త్ తల్లిదండ్రులు ఎంఇఒ, డిఇఒల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందిం చకపోవటంతో ప్రజావాణిలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు తిరిగి డిఇఒకు రాశారు. వారు ఎస్సెస్సీ బోర్డు తప్పిదంగా తేల్చి చేతులు ముడుచు కూర్చున్నారు. భరత్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయగా.. ఉత్తమ మార్కులతో పాసయ్యాడు. పూర్తిగా అర్హత ఉన్న భరత్ అధికారుల నిర్లక్షానికి పాలిటెక్నిక్‌లో చేరే అవ కాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రథమం స్థానంలో అడ్వాన్స్ సంప్లెమెంటరీ పడుతుందని బాధ
ఎప్పుడు పాఠశాలలో ప్రథమంగా నిలిపిన సబ్జెక్టులో నేను ఫెయి ల్ అవటం ఏంటని మా బాబు తీవ్రంగా మనోవేదన పడుతున్నాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ సహాయం చేయటానికి ప్రయ త్నాలు చేయటం లేదు. వారి నిర్లక్షానికి మా బాబు భవిష్య విద్యా జీవితంలో చెరగని మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత పొందినట్లు ఎస్ఎస్సి సర్టిఫికెట్ అందుకోవాల్సిన స్థానంలో అడ్వాన్స్ సంప్లమెంటరీలో పాసయినట్లు దృవపత్రం అందుకోవాల్సిన పరిస్థితి దుస్థితి కలిగిందని కుంగిపోతున్నాడు. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ నా బాబుకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. ఎస్ఎస్సి బోర్డు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. – నర్సింలు, భరత్ తండ్రి