కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ హార్నర్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. 61 ఏళ్ల జేమ్స్ ప్రయాణిస్తున్న సింగిల్ ఇ...
కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ హార్నర్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. 61 ఏళ్ల జేమ్స్ ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజన్ విమానం నిన్న ఉదయం సాంటా బార్బరా సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జేమ్స్ మృతి చెందినట్టు అతని అసిస్టెంట్ సిల్వియా ఫేస్బుక్ పేజీలో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఫైలట్ మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1997లో హాలీవుడ్లో ఎవర్గ్రీన్ సూపర్‌హిట్ చిత్రంగా నిలిచి ఆస్కార్ అవార్డు పొందిన టైటానిక్ సినిమాకు జేమ్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. అదేవిధంగా ఏలియన్స్, అవతార్, బ్రేవ్హర్ట్ అండ్ ఎ బ్యూటీపుల్ మైండ్ విజయంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా నుంచి సంగీతంలో డిగ్రీ పట్టాను తీసుకున్న జేమ్స్ 100 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.