File Photo ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల భాగోతం బయటపడుతున్నది. సీమాంధ్ర పాలకుల నిర్వాకం వల్ల 1000 మంది విద్యార్థులు అ...
![]() |
| File Photo |
ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల భాగోతం బయటపడుతున్నది. సీమాంధ్ర పాలకుల నిర్వాకం వల్ల 1000 మంది విద్యార్థులు అడ్మిషన్ కోల్పోయారు. ప్రభుత్వ ఇంటర్ బోర్డుతో సంబంధం లేకుండా బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిని యాజమాన్య కోటాలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు చేర్చుకున్నాయి. ఈ విషయం గుర్తించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి వారి అడ్మిషన్లను నిలిపివేసింది. ఇక స్పాట్ కౌన్సెలింగ్‌లోనూ మరో 1000 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చిన వైనం గుర్తించింది. అయితే పరీక్షలు పూర్తి కావడంతో ఏమీ చేయలేని పరిస్థి తి ఎదురైంది. బోగస్ సర్టిఫికెట్ల భాగోతం ఇక నుంచి నడవదని తెలంగాణ ఉన్నతవిద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి హెచ్చరించారు.
