(30 Jun) హైదరాబాద్ : సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాల్లోని 11ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా సి...
(30 Jun) హైదరాబాద్ : సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాల్లోని 11ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న సింగరేణి ఆణిముత్యాలు షెడ్యూల్ను యాజమాన్యం ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ఆరు వరకు జరుగనున్న ఈ కార్యక్రమానికి నిష్ణాతులైన ఫ్యాకల్టీలను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఎంపిక చేశారు. ఆర్మీ, పోలీసు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) సెంచూరియన్ స్కిల్స్ యూనివర్సిటీ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయం, డీఆర్డీఏలకు చెందిన అధికారులు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడంతోపాటు ఎటువంటి నైపుణ్యాలు పొందాలనే అంశాలను సదస్సుల్లో వివరించనున్నారు.