- జీఓ 29 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - టైగర్ బఫర్‌జోన్ కార్యాలయానికే పరిమితం నిర్మల్, : నిర్మల్ అటవీశాఖ డివిజన్ కార్యాలయాన్ని ఎత్తివేసేం...
- జీఓ 29 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- టైగర్ బఫర్‌జోన్ కార్యాలయానికే పరిమితం
నిర్మల్, : నిర్మల్ అటవీశాఖ డివిజన్ కార్యాలయాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 120ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్ అటవీశాఖ డివిజన్ కార్యాలయాన్ని ఎత్తివేయాలన్న నిర్ణయంపై అటవీశాఖ ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. టైగర్ జోన్ కారణంగా ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ని ర్మల్ అటవీ డివిజన్ కార్యాలయాన్ని ఎత్తివేసేందు కు సంబంధించి ప్రభుత్వం జీఓ 29ని జారీ చే సింది. కవ్వాల్ అభయారణ్యాన్ని ప్రభుత్వం టైగర్ రిజర్వుగా మార్చిన నేపథ్యంలో అటవీశాఖ తీసుకవచ్చిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజా నిర్ణయంతో అ టవీశాఖ వర్గాల్లో కలకలం మొదలైంది. టైగర్ రిజర్వుకు సంబంధించి కోర్, బఫర్ ఏరియాలుగా వి భజించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జన్నారం అటవీ డివిజన్ కార్యాలయాన్ని టైగర్ రిజర్వు కో ర్ ఏరియా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంగా మా ర్చనున్నారు. ఇక నిర్మల్ అటవీ డివిజన్ కార్యాలయాన్ని మార్చి ప్రాజెక్టు డైరెక్టర్ టైగర్ రిజర్వు బ ఫర్ ఏరియాగా మారుస్తున్నారు.
ప్రస్తుతం నిర్మల్ పరిధిలో ఉన్న కడెం, పెంబీ అటవీ రేంజ్‌లను జ న్నారం డివిజన్‌లోకి చేర్చుతున్నారు. ఇక ఖానాపూర్ అటవీరేంజ్ను రెండు భాగాలు విభజించి స గం ప్రాంతాన్ని జన్నారం కోర్ ఏరియాలో కలుపుతుండగా మిగత ఏరియా ప్రాంతాన్ని నిర్మల్ బ ఫర్ ఫారెస్టు కార్యాలయానికి అనుసంధానం చే యనున్నారు. ఈ నిర్ణయంతో నిర్మల్ రెగ్యులర్ డి విజన్ కార్యాలయంతో పాటు ఖానాపూర్ కలప డిపో, నిర్మల్ లాయింగ్ డీఏఫ్ఓ, ప్లయింగ్‌స్కాడ్ డీఏఫ్ఓ కార్యాలయాలు పోస్టులు, సిబ్బందితో స హా తరలిపోనున్నాయి. దీన్ని అటవీశాఖ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1895లో ఏర్పాటైనా నిర్మల్ అటవీ డివిజన్‌కు ఎంతో చరిత్ర ఉందని జి ల్లాలోనే అత్యంత కీలకమైన లాయింగ్, ప్లయింగ్స్వాడ్ డీఏఫ్ఓ పోస్టులు నిర్మల్‌లోనే ఉన్నాయని ఆ కార్యాలయాలను తరలించడం సరికాద ని ఉ ద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. టైగర్‌జోన్ బఫర్, కోర్ ఏరియాలతో అనేక నిషేద్ఞాలు అమల్లోకి వస్తాయని ఉద్యోగులు ఆందోళన చెందుతు న్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచిం చి జీఓ 29ని రద్దు చేయాలని అటవీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్టే శేఖర్ డిమాండ్ చే శారు. అయితే కొత్తగా ఏర్పడనున్న కార్యాలయాలకు సంబంధించి పదిరోజుల్లో ఉత్తర్వులు జారీచేసే అవకాశముందని సమాచారం.