(30 Jun) ఈసారి అడ్మిషన్లకు వెబ్కౌన్సెలింగ్జూ లై రెండోవారంలో ధ్రువపత్రాల పరిశీలన ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ ఉస్మ...
- (30 Jun)
- ఈసారి అడ్మిషన్లకు వెబ్కౌన్సెలింగ్జూ
- లై రెండోవారంలో ధ్రువపత్రాల పరిశీలన
- ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్
- ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 29: ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఓయూసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ సురేశ్‌కుమార్ సోమవారం ఫలితాలను విడుదల చేశారు. ఓయూసెట్‌కు 1,05,505 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 88,417 మంది పరీక్షలు రాశారని, వారిలో 83,098 మంది (93.98శాతం) అర్హత సాధించారని సురేశ్‌కుమార్ తెలిపారు. అర్హత సాధించినవారిలో 51,548 మంది పురుషులుకాగా 31,548 మంది మహిళలున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ద్వారా నాలుగు యూనివర్సిటీల్లోని 19,306 సీట్లు భర్తీ చేయనున్నారు. ఉస్మానియా పరిధిలో అత్యధికంగా 12,520, తెలంగాణలో 1,985, మహాత్మాగాంధీలో 2,490, పాలమూరులో 2,096 సీట్లు ఉన్నాయని సురేశ్‌కుమార్ చెప్పారు. ర్యాంకు కార్డులను విద్యార్థులు ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.in , www.fastmanabadiresults.com లో పొందవచ్చని సూచించారు. ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి