♦ నవదంపతులను కబళించిన రోడ్డుప్రమాదం ♦ కారు, స్కూటీ ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం ♦ కొత్తపేట వద్ద దుర్ఘటన వెల్గటూరు : వారి కాళ్లకు పెట్టిన...

♦ నవదంపతులను కబళించిన రోడ్డుప్రమాదం
♦ కారు, స్కూటీ ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం
♦ కొత్తపేట వద్ద దుర్ఘటన
వెల్గటూరు : వారి కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా తొలగిపోలేదు. తన అర్ధాంగికి మూడుముళ్లు వేసి నెల కూడా దాటలేదు. ఏడడుగులు నడిచి జీవితాంతం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్న జీవితభాగస్వామితోనే తనూ తనువు చాలించింది. వెల్గటూరు మండలం కొత్తపేట వద్ద శుక్రవారం రాత్రి మిగిల్చిన విషాదంలో నవదంపతులు దుర్మరణం పాలయ్యూరు. ఇందులో బాగరవేణి స్వామి(24), బాదరవేణి జమున(20) మృతి చెందారు. వివరాలు ఇవీ.. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి సమీపంలోని ఆర్కే- 6 శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన బాదరవేణి స్వామి వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన జమ్మునతో మే 22న వివాహమైంది.
ఇటీవల జమున తన తల్లిగారింటికి వచ్చింది. ఆమెను తీసుకెళ్లేందుకు స్వామి శుక్రవారం అత్తవారింటికి వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బంధువులతో ఆనందంగా గడిపాడు. సాయంత్రం వేళ తాను తెచ్చిన స్కూటీపై భార్య సమునతో శ్రీరాంపూర్ ప్రాంతానికి బయలు దేరాడు. ఇంటి నుంచి కాస్తదూరం వెళ్లగానే వర్షం ఆరంభమైంది. దీంతో అత్తవారింటి నుంచి వారికి ఫోన్ వచ్చింది. వర్షం కురుస్తోంది, ఇప్పుడు వెళ్లొద్దని బంధువులు కోరారు.
తక్షణమే తిరిగి రావాలని కోరారు. అప్పటికే అంబారిపేట వరకు వెళ్లిన నవదంపతులు.. వర్షంలోనే తిరుగుముఖం పట్టారు. కొత్తపేట గ్రామం దాటగానే ఎదురుగా ఇండికా విస్టా కారు రావడంతో ఢీకొన్నారు. ఈప్రమాదంలో స్వామి, జమున ద్విచక్రవాహనంపైనుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. వారి వాహనం నుజ్జునుజ్జరుుంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
వద్దంటే వెళ్లారు.. విగత జీవులయ్యారు..
అప్పటి దాకా బంధువుల మధ్య సంతోషంగా గడిపిన అమ్మాయి, కొత్త అల్లుడి హోదాలో గౌరవమర్యాదలు అందుకున్న అబ్బారుు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి బంధువలు కన్నీరుమున్నీరయ్యూరు. సాయంత్రం పూట ప్రయాణం వద్దు, ఈరాత్రికి ఇక్కడే ఉండి.. రేపు పొద్దున వెళ్లాలని బావమరిది సత్తయ్య ఎంతగా బతిమాలినా వినకుండా వెళ్లాడని, ఇరవై నిమిషాల్లోనే విగతజీవులయ్యూరని బంధువులు రోదించిన తీరు కలచివేసింది.
జమున తల్లి తన పురిటిలోనే చనిపోవటంతో తండ్రి వెంకటయ్య అన్నీతానై పోషించాడు. అనేక కష్టాలకు ఓర్చి పెద్దచేసి వైభవంగా వివాహం జరిపించాడు. తన కూతురు ఇక ప్రయోజకురాలైందని, తన కష్టాలు, ఇబ్బందులు, బాధ్యతలు తీరాయని ఊరట చెందాడు. ఇంతులోనే నూరేళ్లు నిండియూని తెలియడంతో కుప్పకూలాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.