హైదరాబాద్ : వీధి దీపాలకు వినియోగిస్తున్న విద్యుత్‌ను ఆదా చేయాలని బల్దియా నిర్ణయించిం ది. ఇందుకుగాను ఎల్ఇడి లైట్లను విని యోగించాలని ప్రతిప...
దశల వారీగా ఎల్ఇడి దీపాలను ఏర్పాటు చేసేందుకు మ హానగర పాలక సంస్థ(జిహెచ్ఎంసి) ప్రణాళి కలు రూపొందించింది. ఇటీవల స్వచ్ఛ హై దరాబాద్ కోసం ప్రజాప్రతినిధులతో ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఎల్ఇడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రతిపా దించింది. రూ.445.91కోట్లతో వీధి దీపా లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగ రంలో మొత్తం 3,41,941 వీధి దీపాలు ఉ న్నాయి. ఒక్కో ఎల్ఇడి యూనిట్‌కు రూ.1 3,070 వ్యయం అవుతోందని అంచనాలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు.
త్వరలోనే టెండర్లు ఆహ్వానించేందు కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న స్ట్రీట్‌లైట్లకు 58.73 మెగా వాట్ల విద్యుత్ వినియోగం అయ్యేది. సంవత్సరానికిగా ను రూ.164.64 కోట్ల వి ద్యుత్ బిల్లును జిహెచ్ఎం సి చెల్లిస్తోంది. అలాగే విడి పరికరాలు, కార్మికుల వేతనా లకుగాను రూ.26.27 వ్యయం చేస్తోంది. వీధి దీపాల నిర్వహణకు సంవత్సరా నికిగాను రూ.190.91 కోట్ల వ్యయం అవు తోంది. ఒక్కసారి ఎల్ఇడి దీపాలను అమ రిస్తే నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుం దని జిహె చ్ఎంసి అధికారులు భావిస్తున్నా రు. ఎల్ఇడి లైట్ల ఏర్పాటుతో విద్యుత్ తక్కువ వినియోగం కావడం వల్ల బిల్లు కూడా తక్కువ వచ్చే అవ కాశాలు ఉంటాయి.
అలాగే నిర్వహణ వ్యయ ం కూడా పెద్దగా ఉండకపోవడం వల్ల ఇందు లో కూడా డబ్బులు ఆదా అవుతాయని అధికా రులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంలో మూడు నుంచి ఐదు ప్రాంతాలలో ఎల్ఇడి లైట్ల ను ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలిం చారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహి ల్స్, ఆర్టిసి క్రాస్‌రోడ్ సమీపంలోని విఎ స్టి-రాంనగర్ రోడ్డులలో ప్రస్తుతం వీధి దీపాలను ఎల్ఇడి లైట్లతోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాం తాల్లో ఎల్ఇడి లైట్ల ప్రయోగం విజయవంతం కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం దశల వారీగా అమర్చాలని నిర్ణయా నికి వచ్చారు.