ఆశలన్నీ కేంద్రంపైనే..

- ఓటుకు కోట్లు కేసులో సానుకూల వాతావరణం కోసం చర్యలు - అందులో భాగంగానే గవర్నర్‌పై వ్యాఖ్యల ఉపసంహరణ - గవర్నర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దం...

ఆశలన్నీ కేంద్రంపైనే..
- ఓటుకు కోట్లు కేసులో సానుకూల వాతావరణం కోసం చర్యలు
- అందులో భాగంగానే గవర్నర్‌పై వ్యాఖ్యల ఉపసంహరణ
- గవర్నర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశాలు
- కేసీఆర్‌పైనా దూకుడు తగ్గించాలంటూ అంతర్గత ఆదేశాలు
- అందుకే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా చంద్రబాబు మౌనం
- రాష్ట్ర విభజన అంశాలపైనే హోం కార్యదర్శితో చర్చించాం: ఏపీ సీఎస్ వివరణ


 హైదరాబాద్: 
ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ప్రస్తు త పరిస్థితుల్లో కేంద్రం, గవర్నర్‌తోనే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలోనూ దూకుడుగా వెళ్లకుండా తగ్గాలని ఆయన నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

గవర్నర్ నరసింహన్‌పై విమర్శలు చేయడం తాత్కాలికంగా వివాదం చేయడానికి పనికొస్తుందే తప్ప కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని బాబు గ్రహించారు. అందువల్ల ఆయనతో అనవసర వైరం పెంచుకోరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంలో బాబు కేంద్రంపై ఎన్నో ఆశలతో ఉన్నారని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలతో వ్యవహారం నడపాల్సిన సందర్భంలో గవర్నర్ పాత్ర కీలకమవుతుందని కొందరు నిపుణుల సూచించినట్టు తెలిసింది.

గవర్నర్‌పై వ్యక్తిగత దూషణలు చేయించడాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ తీవ్రంగా పరిగణించారన్న విషయం తెలియడంతో బాబు కంగుతిన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం గవర్నర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రు లు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాధరెడ్డిలతో వివరణలు ఇప్పించిన బాబు.. గవర్నర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ శుక్రవారం కూడా ఏపీ మంత్రులకు ఆదేశాలిచ్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు పొక్కిన తర్వాత బాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దొరికిన చోటల్లా విరుచుకుపడటం ప్రారంభించారు.

ఈ నెల 8న గుంటూరు సభలోనైతే కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ట్యాపింగ్ వ్యవహారమంటూ తెరమీదకు తెచ్చి ఆ తర్వాత ఏపీ మంత్రుల ద్వారా విమర్శలు గుప్పించారు. అయితే మారిన పరిస్థితుల్లో కేసీఆర్ విషయంలోనూ ఆచితూచి స్పందించాలని బాబు సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అందుకే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బాబు మౌనం పాటిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర బిందువు చేసుకుని అధికార పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారని తెలిసింది.

విభజన చట్టం అంశాలపైనే చర్చ: సీఎస్
కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో గురువారం ఢిల్లీలో రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించిన ప్రధాన అంశాలపైనే చర్చిం చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
రాజ్‌నాథ్ సింగ్‌తో సుజనా భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కలిసిన సందర్భంగా కూడా గవర్నర్‌పై మంత్రులు ఉపయోగించిన భాష ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దానిపై రాజ్‌నాధ్‌సింగ్ నుంచి అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలోనే గవర్నర్ విషయంలో బాబు ఒక్కసారిగా రూటు మార్చినట్టు బలంగా వినిపిస్తోంది. గవర్నర్ విషయంలో కేంద్ర హోంమంత్రి సూచనలు పాటించని పక్షంలో రేపటి రోజున ఆయన వద్దకు వెళ్లడానికి ఉన్న మార్గాలు మూసుకు పోతాయేమోనన్న సన్నిహితుల హెచ్చరికలతోబాబు వెనక్కు తగ్గారు.

ఈ కేసు నుంచి బయటపడటానికి కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబు.. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా మలచడంవల్ల  ప్రయోజనం ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే కేసు నుంచి బయటపడటానికి రాష్ట్రస్థాయిలో చేసే ఏ వ్యవహారాలు బయటకు పొక్కకుండా చూసుకుంటూనే.. మరోవైపు ఢిల్లీ పెద్దల విషయంలో సానుకూల వాతావరణం కోసం వారు చెప్పిన మార్గంలోనే పయనించాలన్న భావనకు వచ్చారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఆశలన్నీ కేంద్రంపైనే..
ఆశలన్నీ కేంద్రంపైనే..
http://img.sakshi.net/images/cms/2015-06/61434754994_625x300.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_40.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_40.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy