(25 Jun) నల్లగొండ: ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నేటి తెల్లవారుజామున నల్లగొ...
(25 Jun) నల్లగొండ: ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నేటి తెల్లవారుజామున నల్లగొండ జిల్లా వలిగొండ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన సాంబ(25) అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో స్వస్థలానికి వెళ్తున్నాడు. ఇద్దరూ మెట్లపై కూర్చొని ప్రయాణిస్తున్నారు. రైలు వలిగొండ సమీపంలోకి వచ్చేసరికి స్నేహితులిద్దరూ ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడ్డారు. వేగంగా ప్రయాణిస్తున్న రైల్లోంచి పడటంతో సాంబ సంఘటనాస్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.