(24 Jun) ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్. సిరియాలో దారుణ సంఘటన వారు చేసిన తప్పంతా. భోజనం చేయడమే.. ఆకలి వేసింది భోజనం చేశారు. ఇది పెద్ద తప్...
(24 Jun) ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్. సిరియాలో దారుణ సంఘటన వారు చేసిన తప్పంతా. భోజనం చేయడమే.. ఆకలి వేసింది భోజనం చేశారు. ఇది పెద్ద తప్పు అయిపోయింది. అందుకుగాను, వారికి ఉరి శిక్ష విధించారు. ఇలా కఠినాతి కఠినమైన శిక్ష విధించింది ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్. సిరియాలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సిరియాలోని ఈజోర్ ప్రావిన్స్ మాయాదీన్ గ్రామంలో ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారే. పాపం ఆకలేసింది. ఆకలికి తట్టుకోలేకపోయారు. ఒక్కపొద్దు ఉండలేకపోయారు. రంజాన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా భోజనం తీసుకున్నారనే కోపంతో యువకులను ఉగ్రవాదులు ఉరితీసేశారు. పైగా నేరం చేసినట్లు వారు రంజాన్ నియమనిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారంటూ వారి శవాలపై బోర్డులు పెట్టారు. ఈ విషయాన్ని సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం పర్యవేక్షకులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఉరితీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్న విషయాన్ని సంస్థ బయటపెట్టింది. అంతేకాకుండా మత నిబంధనలను ఉల్లంఘించి ఉపవాస దీక్షను భగ్నం చేశారంటూ ఫ్లకార్డులను మృతదేహాలకు తగిలించారు.