భారతరత్న మాణిక్యం

భారత మాజీ ప్రధాని దివంగత పివి నర్సింహా రావు 94వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఆయన సమాధి వద్ద పలువురు ...

madhusudhanacharyభారత మాజీ ప్రధాని దివంగత పివి నర్సింహా రావు 94వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఆయన సమాధి వద్ద పలువురు నేతలు ఘనంగా నివాళ్లు అర్పించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ బిడ్డ ఢిల్లీ దాకా ఎదిగారని, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రస్తుత పాలకులకూ ఆర్థిక రంగంలో దిశానిర్దేశనం చేశారని పలువురు వక్తలు కీర్తించారు. బహుభాషా కోవిదుడైన తెలంగాణ బిడ్డ పివికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న అవార్డును ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, శాసన స్పీకర్ మధుసూధనాచారి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సలహాదారు కెవి. రమణా చారి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత రావు, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్ర రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు, పివి కుమారుడు రాజేశ్వర్రావు, కుటుంబ సభ్యులు పివి సమాధి జ్ఞానభూమిని సందర్శించి సమాధిపై పూలు చల్లి ఘనంగా నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మట్లాడుతూ తెలుగు జాతి కీర్తి పతాకాన్ని నలు దిక్కులా చాటిన మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పివి నర్సింహారావు అన్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలు భావితరాలకు కూడా గుర్తుండే కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం చేపడుతోందని, అందులో భాగంగా ఢిల్లీలోపివి స్మారక భవనాన్ని కూడా నిర్మించనున్నామన్నారు.భారత ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటించేందుకు తాను వచ్చానని, పివి కుటుంబీలకు కూడా అన్ని విధాలా అండదండలు అందజేస్తామన్నారు. పివి ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ఈ రోజు వరకు కూడా దేశంలోని అందరు ప్రధానులు అనుసరించారంటే ఆయ నకున్న ముందు చూపు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. సభాపతి మధుసూధనా చారి మాట్లాడుతూదేశం గర్వించ దగ్గ ఆణిముత్యం అని కీర్తించారు.ప్రపంచ రాజకీయాలను భారత దేశం తరఫున ఆకళింపు చేసుకున్న రాజనీతిజ్ఞుడు పివీ అని శ్లాఘించారు. దేశాన్నిపాలించాలంటే ఉత్తర భారతీయులే అన్న అంచనాలను తలకిందులు చేస్తూ మైనార్టిలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లూ సమర్థవంతంగా నడిపించిన ఘనత పివికే దక్కుతుందన్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు తెలుగు వాడి సత్తా ఏంటో చూపించారని పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రాజకీయాల్లో దురంధరుడైన పివితో కలిసి పని చేసేందుకు కొద్దిమందికి మాత్రమే అవకాశం లభించిందని, అందులో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందన్నారు. ఓటుకు నోటుపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ రాజకీయాల్లో డబ్బు పంపిణీ చేస్తూ దొరికి పోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అందుకు ప్రధాన కారకుడైన చంద్రబాబు నాయుడుపై సిబిఐ విచారణ జరుపుతోందని, అయితే నైతికంగా చంద్రబాబు నాయుడు ముందు రాజీనామా చేస్తేనే బావుండేదన్నారు. టేపుల్లో ఉన్నది తన గొంతో కాదో బాబు ఇంత వరకు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ల అంశంపై అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ అది ఇండియన్ టెలిగ్రాఫిక్ శాఖ పరిధిలోనిదని, అన్నీ కొద్ది రోజుల్లోనే మరింత విస్తృ
తంగా బయటపడతాయని భావిస్తున్నామన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ పివికి భారత రత్న పురస్కారాన్ని వెంటనేప్రకటించాలన్నారు. రాజకీయ నాయకులకు పివి జీవితం ఒక దిక్సూచి అన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు మాట్లాడుతూ గవర్నర్ నర్సింహన్ రాష్ట్రంలో పరిపాలన అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గుళ్లూ, గోపురాలు, ఆలయాల సందర్శించడం కాస్త తగ్గించి, సెక్షన్ – 8పైనా, అలాగే తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు తగ్గించే దానిపైనా దృష్టి పెడితే మంచిదన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని మాట్లాడుతూ విభజన తర్వాత కూడా కొత్తగా యుటి అంటున్నారని, యుటీ అంటే లూటీ యేనన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోని అంశాల పై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. భారతరత్న ఇవ్వక పోవడం బాధాకరం అని పివి కుమారుడు రాజేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ అంశంపై లేఖ రాయాలని కోరుతున్నానన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ప్రధానిగా ఉన్న సమయంలో పివిని ఎంపిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీ సహకరించిందన్నారు. పివి జ్ఞానభూమిని వైవిధ్యభరితమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వమత ప్రార్థనలు, అన్నదానం, ఉచిత నేత్ర, వైద్యశిబిరాలను ప్రభుత్వంతో పాటు క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ ఎన్.వి. సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నదానం సందర్భంగా జిహెచ్‌ఎంసి ఉచిత మంచినీటి సదుపాయాన్ని కల్పించింది. విఐపిల రాకను పురస్కరించుకుని పోలీసుల గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: భారతరత్న మాణిక్యం
భారతరత్న మాణిక్యం
http://www.manatelangana.org/wp-content/uploads/2015/06/madhusudhanachary-300x214.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_55.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_55.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy