(23 Jun) వరంగల్, జూన్ 23 : జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో వింత చోటు చేసుకుంది. రమేష్ అనే రైతుకు చెందిన వ్యవసాయ భ...
(23 Jun) వరంగల్, జూన్ 23 : జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో వింత చోటు చేసుకుంది. రమేష్ అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో పది మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడింది. వారం క్రిత మే ఈ భూమిలో విత్తనాలు కూడా నాటారు. భారీ వర్షాల కారణంగా గత నాలుగైదు రోజులుగా పొలాల వద్దకు ఎవరూ వెళ్లలేదు. వర్షాలు కాస్త తెరపడంతో అక్కడికి వెళ్లి చూస్తే భూమి పది మీటర్ల లోతు కుంగిపోయ్యింది. ఈ ప్రదేశంలో వ్యవసాయ బావి కూడా లేదని, ఈ గొయ్యి ఎలా ఏర్పడిందో అర్థం కావడం లేదని రైతు రమేష్ చెబుతున్నాడు. వర్షాల వల్లే భూమి కుంగిపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.