(27 Jun) కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంతాలకు మధ్య అనువైన ప్రదేశంగా ఉన్న మంచిర్యాలలో కమిషనరేట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ...
(27 Jun) కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంతాలకు మధ్య అనువైన ప్రదేశంగా ఉన్న మంచిర్యాలలో కమిషనరేట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, మంచిర్యాలలో నూతనంగా కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తామని గత ఏడాది జూన్‌లో వెల్లడించారు. ఈ మేరకు జనవరి 2015లో వరంగల్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కోల్‌బెల్ట్ ప్రాంతాలలో నేరాల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా హత్యలు, దొంగతనాలు, రోడ్డుప్రమాదాలు, భూతగాదాలు, మహిళలపై అఘాయిత్యాలతోపాటు మావోయిస్టు ప్రాబల్యం కూడా ఈ ప్రాంతాలపై ఉంటుంది. నేరాల అదుపు, శాంతిభద్రతలకోసం మంచిర్యాలలో కమిషనరేట్ కోసం కసరత్తు పూరైనట్లు సమాచారం. కమిషనరేట్ ఏర్పాటుకానుండటంతో డీఐజీ, ఐజీ స్థాయి అధికారితోపాటు ఎస్పీస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. సుమారు మూడువేల మంది సిబ్బంది ఆయా పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించనుండటంతో భద్రత మరింత పటిష్ఠం కానుంది.
