జంట నగరాలలో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా కొనసాగు తున్న భారీ సెక్స్ రాకెట్ గుట్టును నగర టాస్క్ఫో ర్స్ పోలీసులు రట్టు చేశారు. టప్పాచబ...
గాంధీనగర్‌కు చెందిన వీరబాబు (42), కూకట్‌పల్లికి చెందిన ఆర్.రమేష్ (43), టోలి చౌక్‌కి చెందిన మహ్మద్ ఖలీల్ (33), లంగర్‌హౌస్‌కు చెందిన మహేష్ రాఠీ (25), అత్తాపూర్‌కు చెందిన దీప్‌చంద్ (22), రాజేంద్రనగర్‌కు చెందిన ఈ.బంగారయ్య (29), పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిజిత్ విశ్వాస్ (29)లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముంబయి, కోల్‌కత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి యువతులను తీసుకువచ్చి జంట నగరాలలో వ్యభిచారం చేయించేవారు.
గతంలో పలు కేసులలో వీరు అరెస్టయ్యారు. మరికొన్ని కేసులలో పరారీలో ఉన్నారు. అయినా ఈ ముఠా తన పని కొనసాగిస్త్తూనే ఉంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకట్‌రెడ్డి, ఎస్ఐలు డి.జలంధర్, ఎం.వెంకటేశ్వర్‌గౌడ్, పి.మల్లిఖార్జున్, ఎం.ప్రభాకరరెడ్డిలు ఆదివారం మధ్యాహ్నం టప్పాచబుత్రా, గోల్కొండ, పంజగుట్ట ప్రాంతాలలోని వారి స్థావరాలపై వరుస దాడులు చేయడంతో వారందరు పట్టుబడ్డారు. ఇందులో వీరబాబు, రమేష్‌లు వ్యభిచార గృహాలు నిర్వహిస్తుండగా, మహ్మద్ ఖలీ ల్, అభిజిత్ విశ్వాస్, దీప్చంద్లు సెక్స్ వర్కర్లను ఇతర రాష్ట్రా లు, జిల్లాల నుంచి బేరం కుదుర్చుకుని నగరానికి తరలిస్తు ంటారు. మిగతావారు వీరికి సహకరించేవారు. వీరందర్నీ అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరి నుంచి మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం
పలుమార్లు వ్యభిచార కేసుల్లో అరెస్టై జైలుకెళ్లి వచ్చినా బుద్ధిమారని ఈ ఏడుగురిలో కొందరిపై పీడీ యాక్ట్ ప్రయో గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపారు. గతంలో ఇలాంటి కేసులలో బంజారాహిల్స్‌కు చెందిన ఇద్దరు వ్యభిచార నిర్వాహకులపై గత ఏడాది పీడీయాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే.
వ్యభిచార గృహంపై దాడి….
అమీర్‌పేట: గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేసి విటుడిని, నిర్వహకులను అదుపులొకి తీసుకున్నారు. ఎస్ ఆర్ నగర్ ఎన్స్పెక్టర్ రమణగౌడ్ కథనం ప్రకారం బీహర్‌కు చెందిన మహ్మద్ అలాం నెల్లురు జిల్లాకు చెందిన శాంతి అనే మహిళ, సురేష్‌లు నగరంలోని కళ్యాన్ నగర్ ప్రాంతంలో ప్లైట్ కొరియర్ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను దిగుమతి చేసుకుంటూ గత కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందటంతో వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వహకులను రాజేంద్ర నగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మల్లికార్జున్ (28), వ్యభిచారం నిర్వహించే అమ్మాయిలను అదుపులొకి తీసుకున్నామని, మరో నిర్వహకుడు సురేష్ పరారిలో ఉన్నాడని ఆయన తెలిపారు.