అనుష్క టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చారిత్రక చిత్రం రుద్రమదేవి. గుణాటీమ్ వర్క్స్ పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున...
అనుష్క టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చారిత్రక చిత్రం రుద్రమదేవి. గుణాటీమ్ వర్క్స్ పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. చిత్రాన్ని మరింత క్వాలిటీతో తీర్చిదిద్దే క్రమంలో విడుదల కొంచెం ఆలస్యమైంది. అందుకే గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 26న ప్రేక్షకులముందుకు తీసుకురాలేకపోతున్నాం.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాలనే ఉద్ధేశ్యంతో మరికొంత సమయం తీసుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. చిరంజీవిగారు వాయిస్ఓవర్ అందించడం మా సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు. అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అజయ్‌విన్సెంట్, ఆర్ట్: తోట తరణి, సంగీతం: ఇళయరాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.
Key Tags
Rudramadevi movie released late , Rudramadevi movie , Anushka, alluarjun,Gunasekhar director