(28 Jun) కలెక్టరేట్ : మోడీ సర్కార్ చెప్పిన అచ్చే దిన్ కార్మికులకు రాలేదు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ కూడ కార్మికులకు వచ్చేస్థితి ...
(28 Jun) కలెక్టరేట్ : మోడీ సర్కార్ చెప్పిన అచ్చే దిన్ కార్మికులకు రాలేదు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ కూడ కార్మికులకు వచ్చేస్థితి కనబడలేదని, ఇద్దరు దొందుదొందేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ అన్నారు. ఆదివారం ఆర్అండ్బి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్మిక పోరుబాట సదస్సులో పాల్గొని ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమ విపత్తులను ప్రసన్నం చేసేందుకు ఇరు రాష్ట్రాలు దేశ దేశాన తిరుగుతు భూమి గనుల వంటి సహజ వనరులను దోచిపెడుతామని హామీలిస్తున్నారని ఆరోపించారు. అనేక దశాబ్దాలుగా పోరాటాలతో సాధించుకున్న చట్టాలను ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారని పేర్కొన్నారు.