(25 Jun) అమెరికా అధ్యక్ష బరిలో బాబీ జిందాల్ ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్ నిలిచా...
(25 Jun) అమెరికా అధ్యక్ష బరిలో బాబీ జిందాల్ ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్ నిలిచారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెర తీస్తూ, లూసియానా గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత బాబీ జిందాల్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగే సభతో ఆయన ప్రచార రంగంలోకి దిగుతారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య 12 మందికి చేరింది.