(28 Jun) ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరతారని సమాచారం. సీఎం కేసీఆర్ వరుసగా నాలుగో రోజు కూడా ఫాంహౌస్ లోనే గడిపారు. మెదక్ జిల్లా జ...
(28 Jun) ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరతారని సమాచారం. సీఎం కేసీఆర్ వరుసగా నాలుగో రోజు కూడా ఫాంహౌస్ లోనే గడిపారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని ఫాంహౌస్ కు మూడు రోజుల క్రితం ఆయన చేరుకొన్నారు. ఖరీఫ్ పనుల్లో బిజీబిజీగా గడిపారు. దీనికి భిన్నంగా శనివారం సరదాగా గడిపారు. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేశారు. కేటీఆర్ కొడుకు హిమాన్షు, ఎంపీ కవిత పిల్లలతో కేసీఆర్ సరదాగా గడిపారు. ఒకే కారులో ఫాంహౌస్ అంతా కలియ తిరిగారు. ఆయన నిర్వాహకులతో మాట్లాడుతుండగా, పిల్లలు పొలం గట్లపై తిరుగుతూ ఆటలాడుకున్నారు. కాగా, ఆదివారం కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటారని, సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరతారని సమాచారం.
