-ఏపీ సీఎం, డీజీపీలపై బంజారాహిల్స్, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు బంజారాహిల్స్/ సరూర్‌నగర్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్...
-ఏపీ సీఎం, డీజీపీలపై బంజారాహిల్స్, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు
బంజారాహిల్స్/ సరూర్‌నగర్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రను ప్రపంచానికి చూపిన టీ న్యూస్ టీవీ చానల్‌కు నోటీసులు ఇచ్చిన ఆంధ్రా పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లలో తెలంగాణవాదులు శనివారం ఫిర్యాదులు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ శ్రీరంగారావు, కో కన్వీనర్ కొంతం గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ రాముడు, విశాఖపట్నం ఏసీపీ రమణలపై ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు కొంతం గోవర్థన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్రలు, ఆల్ ఇండియా మైనార్టీస్, ఎస్సీ,ఎస్టీ సొసైటీ ఉపాధ్యక్షుడు హబీబ్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి హసన్‌షరీఫ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
