(25 Jun) హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భౌగోళికం...
(25 Jun) హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తేల్చి చెప్పింది. ఒకవేళ ఈ సంస్థల సేవలు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటే.. తగిన ఛార్జీలు చెల్లించి వాడుకోవాలని స్పష్టం చేసింది. హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న 140కి పైగా సంస్థల ఆస్తులు, నిధులు అన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తెలిపింది. ఆయా సంస్థల్లో ఇతర ప్రాంతాల వారు ఉంటే వారిని పంపించి, తెలంగాణ వారినే నియమించుకోవాలని చెప్పింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.