హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులను, వీడియోలను తమకు కూడా ఇవ్వాలని సెంట్రల్ ...
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులను, వీడియోలను తమకు కూడా ఇవ్వాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సిఇసి) ఎసిబి కోర్టులో మెమోలు దాఖలు చేసింది. దీనిపై రేవంత్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎసిబి మెమోలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిఇసి కూడా ఆడియో టేపులు కావాలంటూ మెమోలు దాఖలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
